ప్రజల వద్దకు అరుదైన రచనలు

తెలుగు సాహిత్యం, మతం, చరిత్రకు సంబంధించిన అరుదైన రచనలను ప్రజల ముంగిట్లోకి ఇంకా చెప్పాలంటే నెట్ ఇంట్లోకి (ఇంటర్నెట్) తీసుకురావాలనే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.ఈ రచనలను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉన్న అన్నమాచార్య గ్రంథాలయంలో భద్రపరుస్తారు.

 Rare Telugu Religious And Historical Work Preserved-TeluguStop.com

అలాగే ఇంటర్నెట్లో కూడా పెడతారు.దీంతో ఈ దేశంలో ఉన్నవారైనా ఈ పుస్తకాలు చదువుకోవచ్చు.

తెలుగు వికీపీడియా కమ్యునిటీ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ కలిసి ఈ కార్యక్రమం రూపకల్పన చేసాయి.అన్నమాచార్య గ్రంథాలయంలో తెలుగు సహా 7 భాషలకు చెందిన పుస్తకాలు ఉన్నాయి.

తెలుగు వికీపీడియా ఆన్ లైన్లో ఉన్న అతి పెద్ద విజ్ఞాన గని.అంటే ఎన్సైక్లోపీడియా అన్న మాట.వివిధ అంశాలకు సంబంధించిన రచనలు వికీపీడియాలో 61,506 ఉన్నాయి.50 మంది ఎడిటర్లు వాలంటరీగా రచనలు ఎడిట్ చేస్తున్నారు.తెలుగు వికీపీడియాకు అనుబంధంగా తెలుగు వికీ సోర్సు కూడా ఉంది.ఇందులో 26 వేలకు పైగా అరుదైన పుస్తకాలు ఉన్నాయి.ఈ తరం యువత నెట్ పైనే ఎక్కువ ఆధార పడింది కాబట్టి అందులో పుస్తకాలు ఉంచితే వారికి ప్రయోజనం కలుగుతుంది.తెలుగు చరిత్రను, సాహిత్యాన్ని, సంప్రదాయాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.

మన మూలాలు మరచిపోతే మన ఉనికిని కోల్పోతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube