గొర్రెలకాపరికి దొరికిన అరుదైన రాయి.. విలువ ఎంతుంటుందో తెలిస్తే షాక్ అవుతారు?

అదృష్టం వరిస్తే డబ్బు సంపాదించడం ఎంతసేపు, రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయిపోవచ్చు!” అనేమాటను మనం కొట్టి పారేసినా, అరుదుగా కొంతమందికి నిజంగానే ఇలాంటి జాక్ పాట్ కొట్టేస్తుంటారు.నిత్యం వార్తల్లో మనం చూస్తుంటాం.

 Rare Stone Found By A Shepherd .would You Be Shocked If You Knew The Value  Shee-TeluguStop.com

పలానా చోట లంకె బిందులు దొరికాయని, మరొక చోట ఎవరికో వజ్రాలు దొరికాయని, ఇంకెవరికో చెంబులు దొరికాయని, లేదంటే భారీ లాటరీ పేలిందని వింటూవుంటాం.దాంతో అప్పటి వరకు కటిక పేదరికం అనుభవిస్తున్నవారు సడెన్ గా డబ్బున్నవారు అయిపోతారు.

ఇలాంటి ఘటనలు మనం అనేకం చూసాం.ఇలాంటి ఛాన్స్ మాకెందుకు రాదు అని లోలోపల మదనపడిపోతూ ఉంటాం కదా.సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా జరిగింది.

అలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేలా కనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, పేరవరం గ్రామానికి చెందిన ‘రమేష్‘ గొర్రెల కాచుకొని జీవనం కొనసాగిస్తున్నాడు.

ఎప్పటిలాగే మేతకు గొర్రెలను తోలుకెళ్లి.మధ్యలో నీళ్లు తాగించేందుకు స్థానిక గోదావరి తీరానికి తోలుకు వెళ్లాడు.

వెళ్లగా అక్కడ రమేష్ కి గోదావరి ఒడ్డున కళ్లు మిరిమిట్లు గొలిపేలా మెరుస్తూ ఒక తెల్లటి రాయి కనిపించింది.రాయి మధ్యలో వజ్రాలు పొదిగినట్లు మెరుస్తూ ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.

వెంటనే దాన్ని తెలిసినవారికి చూపించడంతో ‘అతి వట్టి రాయి కాదు, వజ్రాల రాయి‘ అని చెప్పారట.

Telugu Diamonds, Sheep Helper, Latest-Latest News - Telugu

దీంతో, ప్రస్తుతం ఆ రాయిని రమేష్ తన ఇంటోనే భద్ర పరిచినట్లు ఓ మీడియా వేదికగా మాట్లాడాడు.అయితే, స్థానిక ఆర్కియాలజీ అధికారులు వస్తే గాని, ఈ రాయికి ఉన్న విశిష్టత, విలువ అనేవి బయటకు తెలియవు.అయితే స్థానికులు మాత్రం దాన్ని వజ్రాల రాయి గానే పరిగణిస్తున్నారు.

కొన్నేళ్లుగా పేదరికం అనుభవిస్తున్న రమేష్ కి ఈ రాయితో మంచి భవిష్యత్తు ఉండబోతుందని స్థానికులు భావిస్తున్నారు.అయితే అధికారులు వచ్చి నిర్ణయిస్తేగాని అసలు ట్విస్ట్ బయటపడదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube