కుక్క కనిపెట్టిన అరుదైన 'పాము'  

Rare Snake Invented By Dog At Karnataka-

కుక్కలకు పాము కనబడితే అది పారిపోయేంతవరకు వదలవు. పాముని ముందుకు కదలకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఈ విధంగానే కర్ణాటకలోని హోళెమక్కి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తోటలో కుక్కకు, నాగుపాముకు మధ్య పెద్ద గొడవే జరిగింది. అవినాశ్‌ అనే వ్యక్తికి చెందిన తోటలో సుమారు అరగంట పాటు సాగిన కీచులాటలో నాగుపాము రోషంతో పడగవిప్పి బుసకొడుతూ కుక్కను ఎదుర్కొంది.

Rare Snake Invented By Dog At Karnataka-

Rare Snake Invented By Dog At Karnataka

కుక్క అరుపులు విని బయటకి వచ్చి చుసిన అవినాశ్ కుటుంబ సభ్యులకు అరుదైన దృశ్యం కంటపడింది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ పడగ విప్పిన పాము భానుడి కిరణాల వెలుగులో మరింత ప్రకాశించడం ఆశ్యర్యానికి గురిచేసింది. ఆ అరుదైన పాముకు సంబంధించిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ విషయం కాస్త స్థానికులకు తెలియడంతో అది అలాంటి ఇలాంటి సర్పం కాదని అద్భుత శక్తులున్న పాము అని స్థానికులు ప్రచారం మొదలుపెట్టడంతో ఆ పాముని చూసేందుకు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు.