ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఖాతాలో రేర్ రికార్డు.. ఐదుగురిని స్టార్ డైరెక్టర్లు చేశారంటూ?

చాలామంది స్టార్ హీరోలు ప్రస్తుతం కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలంటే భయపడుతున్నారు.కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తే సినిమా హిట్టయ్యే ఛాన్స్ కంటే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని కొత్త దర్శకులు తమను సరిగ్గా హ్యాండిల్ చేయలేరని చాలామంది భావిస్తున్నారు.

 Rare Record In Tarak Kalyan Ram Account Details, Kalyan Ram , Junior Ntr, Nandamuri Heroes, Bimbisara, Mallidi Vasisth, Anil Ravipudi, Surender Reddy, Rajamouli, Vv Vinayak-TeluguStop.com

అయితే నందమూరి హీరోలు మాత్రం కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ ప్రశంసలు పొందుతున్నారు.నందమూరి హీరోలతో సినిమాలను తెరకెక్కించిన ఐదుగురు డైరెక్టర్లు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

స్టూడెంట్ నంబర్1 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ఈ సినిమాతో రాజమౌళి దర్శకునిగా పరిచయమయ్యారు.ప్రస్తుతం రాజమౌళి దర్శకధీరుడిగా భాషతో సంబంధం లేకుండా ప్రశంసలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Rare Record In Tarak Kalyan Ram Account Details, Kalyan Ram , Junior Ntr, Nandamuri Heroes, Bimbisara, Mallidi Vasisth, Anil Ravipudi, Surender Reddy, Rajamouli, Vv Vinayak-ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఖాతాలో రేర్ రికార్డు.. ఐదుగురిని స్టార్ డైరెక్టర్లు చేశారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో వీవీ వినాయక్ దర్శకునిగా పరిచయం కాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

ఈ విధంగా తారక్ సినిమాతో పరిచయమైన డైరెక్టర్లు ఇప్పటికీ స్టార్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

మరోవైపు కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి దర్శకునిగా పరిచయమయ్యారు.అతనొక్కడే సక్సెస్ సురేందర్ రెడ్డికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టగా అనిల్ రావిపూడి సైతం స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

బింబిసార సినిమాతో మల్లిడి వశిష్ట్ దర్శకునిగా పరిచయం కాగా మల్లిడి వశిష్ట్ స్టార్ డైరెక్టర్ స్థాయికి ఈ సినిమాతో ఎదిగినట్టేనని చెప్పవచ్చు.కథను అద్భుతంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే మల్లిడి వశిష్ట ప్రశంసలు పొందారు.తారక్, కళ్యాణ్ రామ్ సినిమాలతో ఏకంగా ఐదు మంది డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube