న్యూయార్క్: అరుదైన, అసలైన అమెరికా రాజ్యాంగ ప్రతికి వేలంలో రికార్డు ధర.. ఎంతో తెలుసా..?

పురాతన వస్తువులు, కళాఖండాలు, ప్రముఖులు వాడిన వస్తువులు, చారిత్రాక ప్రాధాన్యం వున్న పత్రాలకు ఎప్పుడూ గీరాకి వుంటుందని కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు రుజువు చేస్తుంటాయి.ఇటీవలి కాలంలో పురాతన వస్తువుల వేలాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 Rare Original Copy Of Us Constitution Auctioned For 43 Million, Us Constitution,-TeluguStop.com

ఈ క్రమంలోనే అమెరికా రాజ్యాంగానికి సంబంధించి నిజమైన ప్రతి గురువారం 43 మిలియన్ డాలర్లకు వేలంలో అమ్ముడుపోయింది. అమెరికా వ్యవస్థాపక నేతలైన జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జేమ్స్ మాడిసన్ వంటి మహనీయులు సెప్టెంబర్ 17, 1787లో ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ హాల్‌లో సంతకం చేసిన యూఎస్ చార్టర్‌లోని 13 కాపీలలో ఇది ఒకటని వేలాన్ని నిర్వహించిన సోథేబీ సంస్థ తెలిపింది.

అయితే దీనిని గెలిచిన బిడ్డర్ వివరాలు తెలియాల్సి వుంది.

క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్ల బృందం ఈ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేసేందుకు 40 మిలియన్లు సేకరించినప్పటికీ దీనిని పొందడంలో విఫలమైంది.

తాము రాజ్యాంగ ప్రతిని పొందలేకపోయినా.చరిత్ర సృష్టించామని క్రిప్టోకరెన్సీ గ్రూప్ ట్వీట్ చేసింది.తాము భౌతిక వస్తువు కోసం అతిపెద్ద క్రౌడ్ ఫండ్ రికార్డ్‌ను బద్ధలు కొట్టామని గ్రూప్ తెలిపింది.72 గంటలలో ఎక్కువ మొత్తాన్ని క్రౌడ్‌ఫండ్ ద్వారా సేకరించామని… వేలంలో విఫలమైనందున విరాళాలు అందజేసిన ప్రతి ఒక్కరికి నగదును వాపసు చేస్తామని క్రిప్టోకరెన్సీ గ్రూప్ స్పష్టం చేసింది.

Telugu Rare Copy, Original Copy-Telugu NRI

సోథేబీస్‌లోని రాతప్రతులు, పురాతన పుస్తకాల నిపుణుడైన సెల్బీ కిఫర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.పెద్దలు సంతకం చేయడానికి ముందు రోజు ముద్రించిన 500 ఎడిషన్‌లలో ఈ రాజ్యాంగ ప్రతి భాగమై వుండే అవకాశం వుందన్నారు.అలాగే సెప్టెంబర్ 16, 1787 సాయంత్రం ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ఇది బయటకు వచ్చి వుండవచ్చని అభిప్రాయపడ్డారు.

Telugu Rare Copy, Original Copy-Telugu NRI

“We the People of the United States, in Order to form a more perfect Union,” went on to be ratified by the individual states, starting with Delaware in December 1787 and ending with Rhode Island in May 1790.అనే వ్యాఖ్యానంతో ఈ రాజ్యాంగ ప్రతి ప్రారంభమవుతుంది.జూన్ 21, 1788న ఇది అధికారికంగా అమెరికా వ్యవస్థాపక చార్టర్‌గా మారింది.న్యూహాంప్ షైర్ దీనిని ఆమోదించిన 13 రాష్ట్రాలలో 9వ స్థానంగా నిలిచింది.ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వున్న రాజ్యాంగ ప్రతులలో ఒకదానిని గురువారం వేలంలో విక్రయించారు.అమెరికాకు చెందిన డోరతీ టాపర్ గోల్డ్‌మన్ దీని విలువను 15 మిలియన్ డాలర్ల నుంచి 20 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.

చివరికి అది అంచనా కంటే రెట్టింపు ధర పలకడం విశేషం.ప్రత్యక్షంగా పాల్గొన్న బిడ్డర్లు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న పలువురు ఫోన్, ఆన్‌లైన్ ద్వారా వేలానికి హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube