మన ఉగాదికి అమెరికాలో అరుదైన గౌరవం..!!

ఉగాది అంటే తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన పండుగ.ప్రపంచ జన్మ ఆయుష్యు లకు మొదటి రోజు కనుక ఉగాది అంటారు.

 Rare Honor For Our Ugadi In America-TeluguStop.com

యుగాది అసలు పేరు కానీ కాలక్రమేణా ఉగాదిగా పిలవడం అలవాటుగా మారింది.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది.

అలాంటి ఉగాదికి దేశం కాని దేశంలో అరుదైన గుర్తింపు లభించింది.అగ్ర రాజ్యంలో ఉన్న తెలుగు వారు, తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారందరూ సంతోషించేలా ఉగాది పండుగకు కి అమెరికా అతిపెద్ద గౌరవం అందించింది.

 Rare Honor For Our Ugadi In America-మన ఉగాదికి అమెరికాలో అరుదైన గౌరవం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఎంతో మంది తెలుగు వారు ఉన్నారు.రాజకీయ రంగం మొదలు, పలు రంగాలలో అక్కడి స్థానిక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు.అయితే ఉగాది పర్వ దినం తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమైనదని, ఆ పండుగ రోజు గూర్చి తెలుసుకున్న ఆ రాష్ట్ర గవర్నర్ బ్రయన్ పి.కెంప్ తెలుగు వారందరూ గర్వించేలా నిర్ణయం తీసుకున్నారు.ఉగాది పర్వదినాన్ని తెలుగు భాష వారసత్వ రోజుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు.

తెలుగు భాష అత్యంత పురాతనమైన బాషల్లో ఒకటని, తెలుగు బాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, చరిత్రలో తెలుగుకు ఎంతో గుర్తింపు ఉందని ఇన్ని ప్రత్యేకతలు ఉన్న తెలుగును గౌరవించుకోవడం తమకు దక్కిన అవకాశంగా భావిస్తున్నామని గవర్నర్ ప్రకటించారు.

ఉగాది పండుగను పురస్కరించుకుని జార్జియా రాష్ట్రంలో ఉండే తెలుగు వారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని, భావి తరాలకు వారు తెలుగు ప్రాముఖ్యతను చాటి చెప్తున్నారని తెలుగు వారి కోరిక మేరకు పార్టీ ఏడాది ఏప్రియల్ 12 వ తేదీను తెలుగు బాష వారసత్వ రోజుగా నిర్ణయించామని అధికారికంగా ధ్రువీకరించారు.ఇదిలాఉంటే ఉగాది రోజును ప్రత్యేక రోజుగా ప్రకటించడంపై అమెరికాలోని తెలుగు సంఘాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Ugadhi #America #Brian P. Kemp

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు