Koti : మ్యూజిక్ డైరెక్టర్ కోటి అరుదైన గౌరవం.. ఆ అవార్డు జాతికి అంకితం చేస్తానంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి( Music Director Koti ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు మంచి మంచి సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు కోటి.

 Rare Honor For Music Directors Koti In The Parliament Of Australia-TeluguStop.com

ఇక జీ తెలుగులో ప్రసారం అయ్యే పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.ఇది ఇలా ఉంటే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటికి ఒక అరుదైన గౌరవం దక్కింది.

తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏ సంగీత దర్శకుడు అందుకోని ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు కోటి.

ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్( New South Wales, Australia ) పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది.తెలుగు సినిమా సంగీతానికి కోటీ చేసిన సేవకుగాని గుర్తింపుగా ఈ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.ఆస్ట్రేలియాకు చెందిన ఎంపీ ఈ గౌరవాన్ని ఆయనకు అందజేశారు.

మెంబర్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ జూలియా ఫిన్ ఈ పురస్కారాన్ని కోటికి చేతికి ఇచ్చి సన్మానం చేశారు.ఇక పురస్కారంలో భాగంగా కోటికి ఒక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని కూడా బహూకరించారు.

దాన్ని స్వీకరించిన కోటి తెలుగు ప్రేక్షకులు, భారతీయులందరితో పాటుకు, ఐక్యరాజ్య సమితి సభ్యలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.భారతదేశానికి ఈ పురస్కరాన్ని అంకితం చేస్తున్నట్లు కోటి ఈ సందర్భంగా ప్రకటించారు.ప్రసంగం చివరిలో జైహింద్ అని ముగించారు.దేశానికి తన పురస్కారాన్ని అంకితమివ్వడంతో జాతి పట్ల తనకున్న కృతజ్ఞతను గౌరవాన్ని బాధ్యతను చాటుకున్నారు.కోటికి పురస్కారం రావడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యాక్త చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube