అమెరికాలో భారతీయుడికి అరుదైన గౌరవం..!

ఓ పోలీస్ కు ఘన నివాళి అందింది.ఇండో అమెరికన్ అయిన ఆ సిక్కు పోలీసు ఆఫీసర్ కు నివాళి లభించింది.2019వ సంవత్సరంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నాడు.సరిగ్గా అదే టైంలో దారుణ హత్యకు గురయ్యాడు.

 Rare Honor For An Indian In America, Usa, Indian, Houston's, Post Office, Named,-TeluguStop.com

ఆయనకు నివాళులర్పిస్తూ 42 ఏళ్ల సందీప్ సింగ్ ధలివాల్ పేరును వెస్ట్‌ హ్యూస్టన్‌ లోని ఒక పోస్టాఫీస్‌ కు పెట్టడం విశేషం.ఆయన చేసిన సేవలకు గాను గొప్ప సత్కారం లభించింది.

ఆ సిక్కు పోలీసు అధికారి చేసిన సేవలకు గౌవర సూచకంగా థలివాల్ పేరును వెస్ట్‌ హ్యూస్టన్‌లోని ఒక పోస్టాఫీస్‌కు సగౌరవంగా పెట్టారు.అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సందీప్ సింగ్ ధలివాల్ నివశిస్తున్నాడు.ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.2019 సెప్టెంబర్ 27 న ట్రాఫిక్‌ డ్యూటీ చేస్తున్న సమయంలో ధలివాల్‌ ను కొందరు దుండగులు వెనక నుంచి తుపాకీతో కాల్చి హత్య చేశారు.

Telugu Dhaliwal, Indian, Named, Sandeep Singh, Latest-Latest News - Telugu

2015వ సంవత్సరంలో టెక్సాస్‌ లో పనిచేసిన మొదటి సిక్కు పోలీసు అధికారిగా ధలివాల్ ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు.ఆ చుట్టుపక్కల ఆయనంటే ప్రత్యేక గౌరవం ఉంది.సిక్కు సంప్రదాయం ప్రకారంగా గడ్డం పెంచుకునేందుకు, తలపాగాను పెట్టుకునేందుకు ఆయన అనుమతి పొందాడు.అమెరికాలో మొట్ట మొదటి సిక్కు పోలీసు ఆఫీసర్ గా ధలివాల్ హారిస్ చరిత్రకెక్కారు.

ధలివాల్‌ పేరును వెస్ట్‌ హ్యూస్టన్‌ పోస్టాఫీస్‌ కు పెట్టడం గొప్ప విషయం.ఈ విషయాన్ని హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం బుధవారం ట్వీట్టర్ వేదికగా తెలిపింది.

డ్యూటీలో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సందీప్ సింగ్ ధలివాల్ చాలా గొప్ప మనిషి అని నివాళులు అర్పించారు.ఆయన జ్ఞాపకార్థంగా వెస్ట్ హారిస్ కౌంటీలోని పోస్టల్ ఆఫీసుకు ఆయన పేరు పెట్టడం సంతోషకరమైన విషయమని తెలిపారు.

ఆయనను స్మరించుకునే అవకాశం కల్పించిన హారిస్ కౌంటీ కమీషనర్స్‌ కోర్టుకు, అమెరికా పోస్టల్‌ విభాగం అధికారులకు, సిక్కు జాతికి కృతజ్ఞతలను ట్వీట్ ద్వారా తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube