త్రిపురలో ప్రత్యక్షమైన హాగ్ బ్యాడ్జర్ ..!

మనకు ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు అంతరించిపోతున్నాయి.నాటి డైనోసార్ తో మొదలుపెడితే నేడు చిన్నారి పిచ్చుకలు ఇలా ఎన్నో జీవరాసులు మానవుని కంటికి కనిపించకుండా పోతున్నాయి.

 Hog Badger, Tripura,rare Hog Badgers Found In Tripura, Rare Species-TeluguStop.com

ఇప్పుడు ఏ కొత్త జంతువు కనిపించినా మానవునికి కొత్త వింతలు ఉంటుంది.కానీ అవి ఎన్నో సంవత్సరాలుగా వాటి వృద్ధిని పెంచుకుంటూ వస్తున్నాయి.

కానీ, వాతావరణ మార్పులు పర్యావరణం, అడవులు తగ్గుదల ఇలాంటి కారణాల వల్ల వాటి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది.ఇప్పుడు ఇలానే త్రిపుర రాష్ట్రం లోని సలేమా గ్రామంలో ఓ అరుదైన జంతువు పిల్లలు కనిపించాయి.

ఆ జంతువు పేరు హగ్ బ్యాడ్జర్.

ఈ పేరును ఇప్పటి వరకు చాలామంది విని ఉండకపోవచ్చు.

కానీ ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం ఇది అందరికీ సుపరిచితమైన జంతువు.కానీ వీటి జాతి ఇప్పుడు కొద్దికొద్దిగా అంతరించి పోవడంతో ఎవరికి కనిపించడం లేదు.ఈ జాతి జంతువులు ఆకృతి భలే విచిత్రంగా ఉంటాయి.ముఖం దగ్గర పంది మొఖం వలే పోలి ఉంటుంది.ఇక ఈ జీవిలో కిందనుంచి శరీరం మొత్తం ఎలుగుబంటి శరీరం వలె ఉంటుంది.అలాగే ఈ జీవిలో చాలా ప్రత్యేకతలున్నాయి.

ఇది శాఖాహారం, మాంసాహారం రెండూ తీసుకుంటాయి.

ఇక జీవులు గరిష్ట బరువు 9 కిలోల నుంచి 10 కిలోల వరకు పెరుగుతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇంత అరుదైన జంతువులు అగర్తలా కు తూర్పున 90 కిలోమీటర్ల దూరంలో సలేమా గ్రామంలోకి ఎలా వచ్చాయని అటవీశాఖ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు, వీటికి సంబంధించిన జీవరాశులు ఇంకా దగ్గరలో ఉన్నాయా అనే విధంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రస్తుతానికి ఈ మూడు హగ్ బ్యాడ్జర్ పిల్లలను సెపహిజల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.

మొదటిగా వీటిని ఆ గ్రామంలో కొంత మంది స్థానికులు గమనించి వింతగా కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు తెలపడంతో వీటి మనుగడ ఉందని తెలిసి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube