ప్రపంచంలోనే వింతైన మొట్టమొదటి ఆరోగ్య సమస్య... అతని గొంతులో మొక్కలు మొలుస్తున్నాయి?

టెక్నాలజీ( Technology ) రోజురోజుకీ పెరిగిపోయి ప్రపంచం ముందుకుపోతోంది అని సంతోషపడాలో, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని బాధపడాలో తెలియడంలేదు.అలాంటి సమస్యే ఒకటి మొట్టమొదటి సారిగా ఇపుడు బయటపడింది.

 Rare Health Problem Man Had Plants Growing In His Throat Details, The World's Fi-TeluguStop.com

కోల్‌కతాలోని ( Kolkata ) ఒక వ్యక్తి 3 నెలల నుంచి గొంతు సమస్యతో బాధ పడుతున్నాడు.కారణం తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించగా వారు ఎండోస్కోపీ చేశారు.

ఆ పరీక్షలో తేలింది ఏమంటే, అతనికి గొంతులో చిన్న మొక్కల్లాంటి ఆకారాలు కనిపించాయని తేలింది.దాంతో అవి ఫంగస్ అని వైద్యులు తేల్చారు.

కాగా ఆ రోగికి 61 ఏళ్ల వయసు ఉన్నట్టు తెలుస్తోంది.అతను దగ్గు, అలసట, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలతో… 3 నెలలుగా ఇబ్బంది పడడంతో వైద్యుల్ని సంప్రదించారు.దాంతో ఈ అరుదైన ఫంగల్ వ్యాధి బయటపడింది.కాగా దానిని వైద్య పరిభాషలో ‘అనోరెక్సియా’ అనే వ్యాధి అని చెబుతున్నారు.అయితే ఆయనకు మూత్రపిండ వ్యాధి, మధుమేహం, HIV వంటి సమస్యలు లేకపోవడం అదృష్టం అని చెబుతున్నారు.అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల చరిత్ర కూడా అతనికి లేదు.

అయితే ఈ వ్యాధి ఆయనకు మొక్కల ( Plants ) నుంచి సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.

ఇకపోతే ఆ పేషేంట్ ఒక మైకాలజిస్ట్.తన పరిశోధన కోసం క్షీణిస్తున్న పుట్టగొడుగులు, ఇతర మొక్కల శిలీంధ్రాలను అతగాడు పరీక్షించేవాడట.అలా శిలీంధ్రాలు చేతుల ద్వారా శరీరంలో చేరినట్టు భావిస్తున్నారు.

ఆ శిలీంధ్రాల పేరు కొండ్రోస్టెరియం పర్పురియం. ఈ శిలీంధ్రాలే గొంతులో చేరి మొక్కల్లా మొలిచేశాయ్ అని వైద్యులు తేల్చి చెబుతున్నారు.

కొండ్రోస్టెరియం పర్పురియం అనేది మొక్కల శిలీంధ్రం.ఇది మొక్కలలో, ముఖ్యంగా గులాబీ కుటుంబానికి చెందిన వాటిలో వెండి ఆకుల వ్యాధిని కలిగిస్తుంది.

ఈ వ్యాధి కేవలం మొక్కలకు మాత్రమే వస్తుందని అనుకునేవారు.కానీ ఇప్పుడు తొలిసారి మానవులలో దీనిని గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube