మాంసాహార మొక్క గురించి విన్నారా? మన ఉత్తరాఖండ్‌లో వున్న అరుదైన జాతి అది!

భారత దేశంలోని అంత్యంత మంచుతో కూడిన ప్రాంతాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒకటి.అక్కడి ప్రకృతి వాతావరణం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

 Rare Carnivorous Plant Found In Uttarakhand State Details, Non Veg Plant, Water, Uttarakhand, Viral Latest, News Viral, Social Media , Rare Carnivorous Plant , Uttarakhand State, Sanjiv Chaturvedi, Journal Of Japanese Botany, Carnivorous Plant, Plant Eat Insects, Larvae, Tadpoles-TeluguStop.com

ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు మొదటిసారిగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఓ అరుదైన మాంసాహార మొక్కను కనుగొన్నారు.దీని బొటానికల్ శాస్త్రీయ నామం ట్రిక్యులారియా ఫుర్సెల్లాటా.

సెప్టెంబరు 2021లో ఉత్తరాఖండ్ అడవుల రీసెర్చ్ వింగ్ బృందం ఉత్తరాఖండ్‌ లోని చమోలి జిల్లా, మండల్ లోయలో 4,800 అడుగుల ఎత్తులో ఈ మొక్కను కనుగొనడం విశేషం.ఇక ఈ మొక్క దేశంలో చివరిసారిగా 1986లో ఈశాన్య మేఘాలయ రాష్ట్రంలో కనిపించిందని భోగట్టా.

 Rare Carnivorous Plant Found In Uttarakhand State Details, Non Veg Plant, Water, Uttarakhand, Viral Latest, News Viral, Social Media , Rare Carnivorous Plant , Uttarakhand State, Sanjiv Chaturvedi, Journal Of Japanese Botany, Carnivorous Plant, Plant Eat Insects, Larvae, Tadpoles-మాంసాహార మొక్క గురించి విన్నారా మన ఉత్తరాఖండ్‌లో వున్న అరుదైన జాతి అది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సమాచారాన్ని ప్రతిష్టాత్మకమైన ‘జర్నల్ ఆఫ్ జపనీస్ బోటనీ’లో డాక్యుమెంట్ చేశారు.ఉత్తరాఖండ్‌ లో మాత్రమే కాకుండా మొత్తం పశ్చిమ హిమాలయ ప్రాంతంలోనే ఈ మొక్కను చూడటం ఇదే మొదటిసారి అని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజీవ్ చతుర్వేది PTI వార్తా సంస్థకు తాజాగా తెలిపారు.

సాధారణంగా ఈ మొక్క పోషకాలు లేని నేలపై పెరుగుతుందని అన్నారు.దీని సంభావ్య ఔషధ ప్రయోజనాల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సమూహంలో కొత్త ఆసక్తిని రేకెత్తించిందని చతుర్వేది తెలిపారు.

Telugu Journaljapanese, Larvae, Eat Insects, Rare, Tadpoles, Uttarakhand-Latest News - Telugu

ఇకపోతే బేసిగ్గా వీటిని ‘బ్లాడర్‌వోర్ట్‌లు’ అని అంటారు.ఇది అత్యంత అధునాతనమైన, అభివృద్ధి చెందిన మొక్కల నిర్మాణాలు కలిగి ఉంటుంది.ఇక ఈ మొక్కభాగంలో ఉచ్చు అనే ఓ పరికరంలాంటి భాగం ఉంటుంది.దీని సహాయంతో ప్రోటోజోవా నుండి కీటకాలు, దోమల లార్వా, యువ టాడ్‌పోల్స్ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది.

ఉత్తరాఖండ్‌ లోని క్రిమి సంహారక మొక్కల ప్రాజెక్టు సంబంధించిన అధ్యయనంలో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.అయితే, ఈ జాతులు పర్యాటక ప్రదేశంలో ఉండటం వల్ల, భారీ జీవసంబంధ ఒత్తిడి వల్ల ముప్పును ఎదుర్కొంటున్నాయని నిపుణులు వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube