వైరల్.. మూడు కళ్లతో పుట్టిన ఆవుదూడ.. పూజిస్తున్న ప్రజలు!

ప్రపంచం అంటేనే వింతలు.విడ్డురాలకు నెలవు.

 Rare Calf Born With 2 Heads 3 Eyes In Odisha-TeluguStop.com

అలంటి ప్రపంచంలో ఎప్పుడు ఏదొక వింతలు జరుగుతూనే ఉంటాయి.వాటిని మనం ఇంట్లో కూర్చునే చూస్తున్నాం.

టెక్నాలిజీ పెరగడం వల్ల ఈ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏమి జరిగినా యిట్టె తెలిసి పోతుంది.రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికీ తరచు ఏదొక ఆశ్చర్యం కలిగించే విషయాలు వీడియోల రూపములో కానీ ఫోటోల రూపంలో కానీ కనిపిస్తూనే ఉంటాయి.

 Rare Calf Born With 2 Heads 3 Eyes In Odisha-వైరల్.. మూడు కళ్లతో పుట్టిన ఆవుదూడ.. పూజిస్తున్న ప్రజలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.దీనిని చుస్తే మనం ఆశ్చర్య పోవడం ఖాయం.ఓడిశాలోని నాబరంగపూర్ జిల్లాలో ఒక వింత ఆవు దూడ ప్రసవించింది.ఆ ఆవు దూడ రెండు తలలు, మూడు కళ్ళతో పుట్టడంతో ఆ అవును చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.

ఇప్పుడు నవరాత్రి సమయంలో ఈ ఆవు దూడ పుట్టడంతో ఈ ఆవు దూడను అమ్మవారి అంశగా భావిస్తున్నారు.

ఒక రైతుకు చెందిన ఆవు ఈ వింత ఆవు దూడకు జన్మనిచ్చింది.

ఈ దూడకు మూడు కళ్ళు, రెండు తలలు ఉన్నాయి.ఈ దసరా నవరాత్రి సమయంలో పుట్టడం వల్ల ఆ ఆవును అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజలు నిర్వహిస్తున్నారు.

అక్కడ స్థానిక ప్రజలు కూడా ఆ ఆవు ను చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు.ఆ ఆవు దూడను చూసి ఆశ్చర్య పోవడం వారి వంతు అవుతుంది.

ఇక పాపం ఆ దూడ మాత్రం అంతమంది జనాలను చూసి బెదురూ తుంది.రెండు తలలు ఉండడంతో తల్లి పాలు ఎలా తాగాలో అని సతమత మవుతూ ఉంది.జన్యు లోపం కారణంగానే ఇలా రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిందని పశు వైద్యులు చెబుతున్నారు.కానీ ప్రజలు అవేమి పట్టించుకోకుండా ఆ వింత దూడను చూసేందుకు ఎగబడుతున్నారు.

#Dhaniram #Odisha #Eyes #Calf #Heads

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు