అమెరికాలో తెలుగు ఆచార్యుడు త్రివిక్రమ్ రెడ్డికి అరుదైన అవార్డు

న్యూజెర్సీ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ టెక్నాలజీ వారి ఎక్స్ లెన్స్ ఆప్ టీచింగ్ పురస్కారం నెవార్క్: న్యూ జెర్సీ: జనవరి 24: అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది.న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాల కు న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.

 Rare Award For Telugu Professor Trivikram Reddy In America , Award For Excellenc-TeluguStop.com

జె.ఐ.టీ) ఎక్సలెన్ప్ ఆఫ్ టీచింగ్ పురస్కారాన్ని ప్రకటించింది.మెకానికల్ విద్య బోధనలో అత్యుత్తమ ఆధ్యాపకుడని ఆయన సేవలను ప్రశంసించింది.

మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్ తో పాటు స్ట్రైస్ ఎనాలిసిస్.కూడా చక్కగా బోధించే త్రివిక్రమ్ రెడ్డి ఎన్.జె.ఐ.టీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్లో కూడా టాప్ రేటింగ్ వచ్చిన ప్రొఫెసర్‌గా నిలిచారు మన తెలుగు బిడ్డ త్రివిక్రమ్ రెడ్డి.

ఇది యావత్ తెలుగుజాతి గర్వించే విషయం.ఒక వైపు విద్యా బోధన కొనసాగిస్తూనే మరో వైపు బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ స్టాప్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్ రెడ్డి సేవలందిస్తున్నారు.

రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను కూడా త్రివిక్రమ్ రెడ్డి రూపొందించారు.ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలకు పేటెంట్లను కూడా సాధించారు.తాజాగా ఎన్.జె.ఐ.టీ వారి ఎక్స్ లైన్స్ ఆఫ్ టీచింగ్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని త్రివిక్రమ్ రెడ్డి తెలిపారు.తన బోధనలు, పరిశోధనలు మరింత ఉత్సాహంతో కొనసాగిస్తాను అని తెలిపారు.

Rare Award For Telugu Professor Trivikram Reddy In America , Award For Excellence In Teaching, New Jersey Institute Of Technology, Trivikram Reddy - Telugu Rareaward, Trivikram Reddy

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube