ఏపీలో కనిపించిన అరుదైన పక్షి... కానీ చివరకు...?!

ఈ మధ్యకాలంలో రోజుకు ఏదో ఒక చోట ఓ వింత బయటకు వస్తూనే ఉంది.సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్క విషయాన్ని ప్రపంచం మొత్తానికి చేర వేయగలుగుతున్నం.

 Aquiline Bird Appears In Andhra Pradesh, Aquiline Bird, Ap, Farmers-TeluguStop.com

ఇకపోతే తాజాగా చిత్తూరు జిల్లాలోని కొత్తకోట మండలం డేగాని పల్లెలో ఓ అరుదైన పక్షి స్థానికుల కంటపడింది.ప్రతి రోజూ ఉదయం లేస్తూనే పొలాలకు వెళ్లే రైతులకు ఆ పక్షి కంట పడింది.

మొదటగా పంటపొలాల్లో కి వెళ్ళిన వ్యవసాయ కూలీలు పనులలో నిమగ్నమై ఉండగా, ఇంతలో వారి దరిదాపుల్లో ఏదో జంతువు కదలాడుతున్నట్లు గమనించారు.మొదటగా రైతులు ఆ జంతువును కుందేలుగా భావించారు.

అయితే ఆ ప్రాంతంలోకి కుందేలు ఎలా వచ్చిందని చూద్దామని దగ్గరికి వెళ్లి, చూడగా అక్కడ వారికి పెద్ద పక్షి కనబడింది.అది ఎగిరి వెళ్లేందుకు ప్రయత్నిస్తోండగా వారు గమనించారు.

అయితే అది కుందేలు కాదు, పక్షి అని గమనించిన వారు ఇంత పెద్ద పక్షి ఏంటని ఆ పక్షిని పట్టుకున్నారు.దీంతో ఆ రైతులు ఇది గ్రద్దా లేకపోతే పురాణాల్లో చెప్పినట్టుగా గరుడ పక్షా అని అనుకున్నారు.

అంతలోనే అక్కడో ఓ వ్యక్తి ఇది గ్రద్ద లోనే అరుదైన జాతి అని, ఈ పక్షి అక్విలిన్ జాతి పక్షి అని తెలిపాడు.

Telugu Alvin, Bird, Eagel, Rabbit, Selfie-

అయితే ప్రజలు ఏ జాతి పక్షి అయితే ఏంటి చూడడానికి చాలా పెద్దగా బాగుంది కదా అని దానితో చాలామంది సెల్ఫీలు దిగి వారి కోరికను తీర్చుకున్నారు.ఇక వారు ఆ పక్షిని వారితో చాలాసేపు ఉంచుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా ఓ ప్రాంతంలో వదిలేశారు.అలా వదిలేసిన తర్వాత ఆ పక్షి ఎగిరి వెళుతుంటే… చాలా ఆనందంగా ఉందని ఆ పక్షిని పట్టుకున్న ప్రజలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube