టీఆర్ఎస్ లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు...ఎన్నికలే టార్గెట్టా?

టీఆర్ఎస్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటికే హుజురాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న పరిస్థితులలో ఇక కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

 Rapidly Changing Political Equations In Trs Is Election The Target, Cm Kcr, Trs-TeluguStop.com

తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణను కేసీఆర్ టీ ఆర్ఎస్ లోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.అయితే నిన్న కేసీఆర్ ను కలిసిన ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.అయితే ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయ అడ్డంకులను తొలగించుకుంటూ హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు నల్లేరు మీద నడకలా సాగాలన్నది కేసీఆర్ ప్రధాన వ్యూహంలా కనిపిస్తోంది.

ఎందుకంటే హుజురాబాద్ లో టీఆర్ఎస్ కంచుకోట అంతేకాక టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో ఉన్న పట్టుపై క్లారిటీ ఉండటంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే రాజకీయంగా కెసీఆర్ ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేసేలా రాజకీయ వ్యూహాన్ని పన్నుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇటు బీజీపే అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర, ఇటు రేవంత్ కూడా పాదయాత్రను చేపట్టాలని నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో ఈ సమయంలో కెసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉంది.ఏది ఏమైనా జరగబోయే సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నట్లు తెలస్తొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube