‘‘థర్డ్ వేవ్’’ ముంగిట ఇండియా: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆంక్షలు , అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ కంపల్సరీ

భారత్‌లో మరోసారి కరోనా మహమ్మారి ఉద్ధృతంగా విస్తరిస్తోంది.అగ్నికి ఆజ్యం పోసినట్లు ఒమిక్రాన్ దీనికి తోడు కావడంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది.

 Rapid Rt-pcr Test Mandatory For All International Passengers Landing In Mumbai ,-TeluguStop.com

గడిచిన రెండు రోజులుగా 30 వేలుగా వున్న కొత్త కేసులు.బుధవారం ఒక్కసారిగా 58వేలకు చేరాయి.

అంటే ఒక్కరోజులో 55 శాతం అధికం.అటు ఒమిక్రాన్ విషయానికి వస్తే.

ఇప్పటి వరకు భారతదేశంలో 2,135 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.వీరిలో 828 మంది కోలుకున్నారు.

దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 653 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు.ఢిల్లీ సహా మెట్రో నగరాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.రెండు మూడు రోజుల నాటి డేటాను విశ్లేషిస్తే.దేశంలో థర్డ్ వేవ్ మొదలైనట్లేనని కోవిడ్ టాస్క్‌ ఫోర్స్ చీఫ్ ఎన్‌కే అరోరా అన్నారు.అమెరికా, బ్రిటన్‌లో కూడా తొలుత ఇలాంటి పరిస్థితులే తలెత్తినట్లు ఆయన గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షలను కఠినతరం చేస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లలో నైట్‌కర్ఫ్యూలు అమల్లోకి రాగా.పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ టెస్టులను మరింత పెంచారు.

ఈ క్రమంలోనే దేశ వాణిజ్య రాజధాని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆంక్షలను కఠినతరం చేశారు.

కోవిడ్ కేసుల ఉద్ధృతి రీత్యా ఎయిర్‌పోర్టులో దిగే అంతర్జాతీయ ప్రయాణీకులకు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులను తప్పనిసరి చేసింది ముంబై నగరపాలక సంస్థ.ఈ మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) మంగళవారం వెల్లడించింది.

ఇప్పటివరకు ‘‘ఎట్ రిస్క్’’ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా వుండేది.

Telugu America, Britain, Covidtask, Delhi, Maharashtra, Omicron, Punjab, Rapidrt

ప్రస్తుతం దేశంలో కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించినట్లు బీఎంసీ పేర్కొంది.ర్యాపిడ్ టెస్ట్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రయాణీకులు. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.

ఇందులో నెగిటివ్ వచ్చిన వారినే బయటకు అనుమతిస్తామని బీఎంసీ అధికారులు చెప్పారు.ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్ వస్తే.

వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతామన్నారు.అలాగే సదరు ప్రయాణీకుడిని క్వారంటైన్‌కు పంపుతామని తెలిపారు.

కాగా.మంగళవారం ముంబైలో 10,860 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.ఇది ఒక రోజుతో పోలిస్తే 34.37 శాతం పెరుగుదల.ఏప్రిల్ 7, 2021 తర్వాత ముంబైలో ఒకరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube