రఫేల్ యుద్ధ విమానాల ప్రత్యేకత.. అందుకే !

యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్, ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.దీని కోసం ప్రభుత్వం 2016లో దాదాపు రూ.58000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు సిద్ధమైంది.ఒక్కో విమానం ధర దాదాపుగా రూ.1,611 కోట్లు ఉంటుంది.ఇంత ఖర్చు పెట్టి విమానాలు కొనుగోలు చేస్తుందంటే ఈ రఫేల్ యుద్ధ విమానాల్లో ఏదో ప్రత్యేకత దాగి ఉంటుంది.

 Raphael, Warplanes, India-TeluguStop.com

తాజాగా రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్నాయని కేంద్రం ప్రకటించింది.

రఫేల్ యుద్ధ విమానాలతో అత్యాధునికమైన ఆయుధాలను ప్రయోగించవచ్చు.

ఈ యుద్ధ విమానం దాదాపుగా 9500 కేజీల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు.అంతే కాకుండా రెండు రకాల క్షిపణులను ప్రయోగించే సదుపాయం కల్పించారు.

అణ్వస్త్రాలను సైతం ప్రయోగించవచ్చు.రెండు రకాల క్షిపణుల్లో ఒకటి 150 కిలోమీటర్ల రేంజ్ వరకు దాడి చేయవచ్చు.

ఇంకో క్షిపణితో 300 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించవచ్చు.ఈ క్షిపణులకు గాలిలో నుంచి గాలిలోకి, భూమి మీద నుంచి గాలిలోకి ప్రయోగించే సదుపాయం కలిగి ఉంది.

రఫేల్ యుద్ధ విమానాలు గంటకు 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.శత్రువులు ఏ వైపు నుంచి దాడికి దిగినా క్షణాల్లో వీటి నుంచి తప్పించుకునే సామర్థ్యం ఈ విమానాల్లో ఉంది.

క్షణాల్లో మట్టుపెట్టే సామర్థ్యం కలిగి ఉన్నాయి.ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానాలు కేవలం ఫ్రాన్స్, ఈజిఫ్టు, ఖతర్ దేశాల్లో ఉండగా ఇప్పుడు భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది.

భవిష్యత్ సంభవించే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రఫేల్ విమానాలను కొనుగోలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube