కదల్లేకుండా ఉన్న వ్యక్తిపై రేప్‌ కేసు నమోదు... ఈ కేసు ప్రపంచంలోనే చాలా అరుదైనది  

Rape Case On Wheelchair Person Jorge Stevenson-

ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్‌ స్టీఫెన్‌సన్‌ అనే వ్యక్తి తనను రేప్‌ చేశాడంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు జార్జ్‌ను అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అతడు వీల్‌ చైర్‌కు పరిమితం అయ్యి, కనీసం ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు..

కదల్లేకుండా ఉన్న వ్యక్తిపై రేప్‌ కేసు నమోదు... ఈ కేసు ప్రపంచంలోనే చాలా అరుదైనది-Rape Case On Wheelchair Person Jorge Stevenson

భార్య ఇంట్లోంచి బయటకు తీసుకు వస్తే తప్ప తీసుకు రాలేని పరిస్థితి, బాత్‌ రూం మరియు యూరిన్‌ కూడా వీల్‌ చైర్‌లో ఉండే పోయేలా ఏర్పాట్లు చేయబడింది. అతడు గత కొన్నాళ్లుగా ఇదే పరిస్థితుల్లో ఉన్నాడని భార్య చెప్పుకొచ్చింది.

ఇలాంటి వ్యక్తి రేప్‌ చేశాడని ఆమె ఎలా ఫిర్యాదు ఇచ్చిందా అని పోలీసులు అవాక్కయ్యారు. ఆయన్ను కనీసం ప్రశ్నించకుండానే పోలీసులు అక్కడ నుండి వెళ్లి పోయారు.

పోలీసు వారు వెళ్లి పోవడమే ఆలస్యం వెంటనే తన నిజ స్వరూపంకు జార్జ్‌ వచ్చాడు. వీల్‌ చైర్‌కే పరిమితం అయ్యి, కనీసం కదలలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా నటించిన జార్జ్‌ తనపై రేప్‌ కేసు పెట్టిన మహిళను మళ్లీ వెదికి పట్టుకుని భార్య సాయంతో ఏకంగా 13 సార్లు హత్యాచారం చేశాడు. మళ్లీ ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా వారు నమ్మలేదు. కనీసం ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా అనే ఆలోచన చేయలేదు..

దాంతో ఆ మహిళ కొన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు చూపించడంతో అప్పుడు అతడిని అరెస్ట్‌ చేసి పోలీసుల ముందు ప్రవేశ పెట్టడం జరిగింది.

పోలీసులు అరెస్ట్‌ చేసిన సమయంలో కూడా ఆ వ్యక్తి వీల్‌ చైర్‌కే పరిమితం అయిన వ్యక్తిగా, నడవలేని వ్యక్తిగా నటించాడు. కోర్టులో కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా జీవచ్చవంలా పడి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఎలా రేప్‌ చేశాడు, దాన్ని మేము ఎలా నమ్మాలంటూ కోర్టు న్యాయమూర్తులు ఈ కేసును పదే పదే వాయిదా వేయడం జరిగింది.

ఎట్టకేలకు జార్జ్‌ సొంతంగా కారు డ్రైవ్‌ చేయడం, ఒక రెస్టారెంట్‌కు వెళ్లడం వంటి వీడియోలను పోలీసులు సంపాదించారు. ఆ వీడియోలను కోర్టులో ఇవ్వగా అసలు నిజం బయటకు వచ్చింది. రేప్‌ చేయడంతో పాటు, కోర్టును మోసం చేసినందుకు గాను ఏకంగా 26 ఏళ్లపాటు జార్జ్‌కు జైలు శిక్ష పడింది.