ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో కుమారుడి పై రేప్ కేసు  

Mithun chakraborty\'s son booked in a Rape case, Mithun chakraborty\'s son, Mahaakshay , Yogita Bali , Delhi court, FIR - Telugu Delhi Court, Fir

బాలీవుడ్ లో ఇటీవల కాంట్రవర్సీ లు పెరిగిపోతున్నాయి.ఎదో ఒక విషయంగా నిత్యం బాలీవుడ్ పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

TeluguStop.com - Rape Case On Mithun Chakrabortys Son Mahaakshay

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత నుంచి కూడా బాలీవుడ్ ఎదో ఒక సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ఇప్పుడు తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై రేప్ కేసు నమోదైనట్లు తెలుస్తుంది.

మహాక్షయ్ తనపై అత్యాచారం చేశాడమే కాకుండా, తనను మోసగించాడు అంటూ 38 ఏళ్ళ మహిళ ఓషివారా పోలీస్టేషన్ లో కేసు నమోదు చేసింది.మహాక్షయ్ చక్రవర్తితో తనకు 2015 నుంచి 2018 వరకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 2015 లో అంధేరి వెస్ట్‌లో మహాక్షయ్ కొనుగోలు చేసిన ఫ్లాట్‌కు వెళ్లినప్పుడు తనకు మత్తుమందు కలిపిన సాఫ్ట్ డ్రింక్ తాగించి బలవంతంగా తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు.
అయితే ఆ తరువాత నన్ను పెళ్లి చేసుకుంటానని అతడు హామీ కూడా ఇచ్చాడని, కానీ అతడివల్ల గర్భం దాల్చడం తో మరోసారి అతడిని పెళ్లి చేసుకోవాలి అని కోరడం తో విషయం తెలిసి అబార్షన్ చేయించుకోమని సలహా ఇవ్వడమే కాకుండా, అందుకోసం పిల్స్ కూడా ఇచ్చాడని ఆ మహిళ ఆరోపించింది.2015 నుంచి 2018 వరకు ఇద్దరం కూడా రిలేషన్ షిప్ లోనే ఉన్నామని,ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకుంటానని మహాక్షయ్ వాగ్దానం చేశాడని బాధితురాలు తన కంప్లయింట్ లో తెలిపింది.దీంతో బాధితురాలి వివరాల ఆధారంగా ఓషివారా పోలీసులు అతనిపై రేప్, ఛీటింగ్ తదితర అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.అంతకు ముందు కూడా బాధితురాలు మహాక్షయ్ పైన, అతని తల్లి యోగితా బాలి పైన కూడా బేగంపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

TeluguStop.com - ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో కుమారుడి పై రేప్ కేసు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఓసారి అతడికి ఫోన్ చేస్తే మహాక్షయ్ తల్లి యోగిత బాలి ఫోన్ తీసుకొని మాట్లాడి తనను బెదిరించిందని ఆ మహిళ ఆరోపించింది.

తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌తో కలిసి ఉండేందుకు 2018లో ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి బేగంపూర్ పోలీస్ స్టేషన్‌లో మహాక్షయ్, అతడి తల్లి యోగితా బాలిపై కేసు పెట్టినట్టు బాధితురాలు తెలిపింది.

అయితే ఆ కేసులో ఢిల్లీ కోర్టు మహాక్షయ్, ఆయన తల్లికి ముందస్తు బెయిలు ఇచ్చింది.నేరం జరిగిన ప్రాంతంలోని కోర్టులో కేసు వేయాలని ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ కోర్టు చెప్పడంతో ఓషివారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు బాధిత మహిళ తెలిపినట్లు తెలుస్తుంది.

#Delhi Court

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rape Case On Mithun Chakrabortys Son Mahaakshay Related Telugu News,Photos/Pics,Images..