చాక్లెట్లు ఆశ చిపించి చిన్నారిపై అత్యాచారయత్నం... చివరికి....

Rape Attepmt On Minor Girl In Hyderbad

ఈమధ్య కాలంలో కొందరు కామాందకారంలో మునిగి పోయి తమ ప్రతాపాన్ని అభం, శుభం తెలియని చిన్నారులపై చూపిస్తున్నారు.కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో సైదాబాద్ ప్రాంతంలో జరిగిన ఘటన మరవకముందే మరో చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన ఘటన స్థానిక రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో వెలుగుచూసింది.

 Rape Attepmt On Minor Girl In Hyderbad-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని మంగళ్ హాట్ పరిసర ప్రాంతంలో 10 సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.ఇదే ప్రాంతంలో సుమిత్ అనే యువకుడు కూడా నివాసముంటున్నాడు.

కాగా సుమిత్ కుటుంబ సభ్యులు కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్నారు.దీంతో అప్పుడప్పుడు మైనర్ బాలిక సరుకుల నిమిత్తమై సుమిత్ కిరాణా దుకాణంకి వెళుతూ వస్తూ ఉండేది.

 Rape Attepmt On Minor Girl In Hyderbad-చాక్లెట్లు ఆశ చిపించి చిన్నారిపై అత్యాచారయత్నం… చివరికి….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సుమిత్ చిన్నారి బాలిక పై కన్నేశాడు.అంతేగాకుండా తరచూ స్మార్ట్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూడడం మద్యం సేవించడం వంటివి చేస్తూ ఉండేవాడు ఈ క్రమంలో బాలిక కిరాణా దుకాణాలు రావడంతో ఇదే అదునుగా భావించి మైనర్ బాలికకు చాక్లెట్లు ఆశ చూపించి లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.

దీంతో చిన్నారి బాలిక వెంటనే కేకలు వేయడం ప్రారంభించింది దాంతో నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.అనంతరం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మైనర్ బాలికను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

#Hyderabad #Child Abuse #Hyderabad #Attempt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube