జగన్ అలా పిలవడంపై జనసేన ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే ?  

Rapaka Pawan Kalyan Janasena Razole - Telugu Ap Cm Jagan, Jagan Call The Rapaka Anna, Janasena, Nadendla Manohar, Pawan Kalyan, Rajoll, Rajyasabha Elections, Ysrcp Mlas

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే గా గుర్తింపు పొందిన తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి వార్తల్లోకి వచ్చారు.జనసేన పార్టీ నుంచి గెలిచిన ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ, తరచుగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ను పదే పదే పొగుడుతూ వస్తున్నారు.

 Rapaka Pawan Kalyan Janasena Razole

జనసేన పార్టీలో ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఈయన వ్యవహారంలో జనసేన కూడా ఎప్పటి నుంచో గుర్రు గానే ఉంటూ వస్తోంది.

ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలంటూ పవన్ రాపాక కు సూచించినా, ఆయన మాత్రం వైసిపి అభ్యర్థికి ఓటు వేశారు.ఈ విషయాన్ని బహిరంగంగానే రాపాక చెప్పుకున్నారు.

జగన్ అలా పిలవడంపై జనసేన ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే తాజాగా కాపు నేస్తం నిధులు విడుదల సందర్భంగా ఏపీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాపాకను ఉద్దేశించి జగన్ అన్నా, రాపాక అన్నా అంటూ పలకరించారు.

సీఎం పిలుపుతో రాపాక వరప్రసాద్ ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.ఈ సమావేశంలో ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా, తనను ప్రత్యేకంగా గుర్తించుకుని మరి జగన్ పిలవడపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మధ్య ఎంతో తేడా ఉందని, తోటి ఎమ్మెల్యేలు నాయకుల పట్ల జగన్ అభిమానం, సంస్కారం చూపిస్తారని, కానీ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అలా అభిమానంతో పిలవలేదని చెప్పుకొచ్చారు.

ఈ విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత వైసీపీ నేతలతో చెబుతూ భావోద్వేగానికి గురి అయినట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని తమ అనుచరులతో కూడా చెప్పుకుని జగన్ లా ప్రేమగా పిలిచే వారు చాలా తక్కువ మంది ఉంటారని ఆయన ఆనందపడుతున్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు పవన్ చాలా సమయమే తీసుకున్నారని, ఆ పార్టీలో నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని, కొంతకాలం క్రితం పార్టీ సమావేశం జరుగుతున్న సందర్భంలో తాను ఆలస్యంగా వచ్చినందుకు పవన్ కళ్యాణ్ ముందే నాదెండ్ల మనోహర్ తన వెటకారం చేస్తూ మాట్లాడినా పవన్ స్పందించలేదనే విషయాన్ని రాపాక ఇప్పుడు గుర్తు చేసుకుంటూ జగన్ అభిమానాన్ని ప్రశంసిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rapaka Pawan Kalyan Janasena Razole Related Telugu News,Photos/Pics,Images..

footer-test