వాటితో తనకు సంబంధం లేదన్న రావు రమేష్  

Rao Ramesh Serious On Fake Accounts - Telugu Celebrity, Facebook, Fake Accounts, Instagram, Rao Ramesh, Social Media, Twitter, Vv Vinayak

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా పరిధి చాలా ఎక్కువ అయ్యింది.ప్రతి సెలబ్రెటీ మరియు ప్రముఖులు అంతా కూడా సోషల్‌ మీడియాలో ఉంటున్నారు.

 Rao Ramesh Serious On Fake Accounts

అయితే కొందరు మాత్రం ఇంకా సోషల్‌ మీడియాకు దూరం ఉంటున్నారు.ఆ కొద్ది మంది పేరుతో కొందరు ఆకతాయిలు సోషల్‌ మీడియాలో అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆమద్య వివి వినాయక్‌ పేరుతో ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి భారీగా ఫాలోవర్స్‌ను చేసుకున్నారు.ఇప్పుడు రావు రమేష్‌ పేరుతో కూడా సోషల్‌ మీడియాలో అకౌంట్స్‌ నడుస్తున్నాయి.

వాటితో తనకు సంబంధం లేదన్న రావు రమేష్-Movie-Telugu Tollywood Photo Image

తన పేరుపై వస్తున్న సోషల్‌ మీడియా పోస్ట్‌లపై రావు రమేష్‌ స్పందించాడు.కొందరు కావాలని తన పేరుతో అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారు.వాటితో నాకు సంబంధం లేదు.నా పేరుతో ఎవరైనా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించాడు.

ఎవరి గురించి అయినా తన పేరుతో ట్వీట్స్‌ చేసినా పోస్ట్‌లు పెట్టినా కూడా తనకు సంబంధం లేదు అన్నట్లుగా రావు రమేష్‌ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు తనకు ట్విట్టర్‌లో కాని, ఫేస్‌బుక్‌లో కాని, ఇన్‌స్టాలో కాని అకౌంట్స్‌ లేవని పేర్కొన్నాడు.

తనకు సోషల్‌ మీడియాలో అస్సలు ఆసక్తి లేదని పేర్కొన్నాడు.ప్రస్తుతం సినీ వర్గాల్లో కొన్ని ఫేక్‌ అకౌంట్స్‌ వివాదాలకు కారణం అవుతున్నాయి.

దాంతో ముందు జాగ్రత్తగా రావు రమేష్‌ తనకు సోషల్‌ మీడియా అకౌంట్స్‌ లేవని క్లారిటీ ఇచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rao Ramesh Serious On Fake Accounts Related Telugu News,Photos/Pics,Images..

footer-test