మహా సముద్రంలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న రావు రమేష్

సీనియర్ విలక్షణ నటుడు రావుగోపాలరావు కొడుకుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ చాలా తక్కువ సమయంలో తండ్రిని మించిన తనయుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.తన విలక్షణ నటనతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా విభిన్న పాత్రలు చేస్తూ నటుడుగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

 Rao Ramesh As Hunchback In Maha Samudram Movie-TeluguStop.com

ప్రకాష్ రాజ్ తర్వాత టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో రావు రమేష్ ఒకరనే గుర్తింపు ఉంది.ప్రస్తుతం యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరి సినిమాలలో రావు రమేష్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తున్నాడు.

అతని చేతినిండా ప్రస్తుతం సినిమాలు ఉన్నాయి.కెరియర్ ఆరంభంలో మగదీర సినిమాలో రావు రమేష్ శారీరక వైకల్యం ఉన్న మాంత్రికుడు పాత్రలో కనిపించి మెప్పించాడు.

 Rao Ramesh As Hunchback In Maha Samudram Movie-మహా సముద్రంలో అలాంటి పాత్రలో కనిపించబోతున్న రావు రమేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పాత్ర చేసింది రావు రమేష్ అనే విషయం రివీల్ చేసేంత వరకు ఎవరికీ తెలియదు.ఇక మాంత్రికుడు పాత్రలో సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది.

అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి విభిన్న పాత్రలో రావు రమేష్ కనిపించబోతున్నాడు.శర్వానంద్, సిద్ధార్ద్ కాంబినేషన్ లో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రావు రమేష్ మగధీర తరహాలో గూనివాడి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రతినాయక పాత్రలలో ఇది కూడా ఒకటని, సినిమాలో ఈ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా.మరి చాలా గ్యాప్ తర్వాత మరో సారి రావు రమేష్ చేస్తున్న ఈ విభిన్న పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

#MahaSamudram #Rao Ramesh #Ajay Bhupathi #Sharwanand #Anil Sunkara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు