అపరిచితుడు హిందీ రీమేక్ కోసం ఆ హీరో ప్రయత్నాలు

దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో 15 ఏళ్ల క్రితం చియాన్ విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ్ బాషలలో ప్రేక్షకుల ముందుకి వచ్చి సంచలన విజయం సొంతం చేసుకున్న సినిమా అపరిచితుడు.ఈ సినిమా ఒక్కసారిగా విక్రమ్ ఇమేజ్ ని మార్చేసి స్టార్ హీరోల కేటగిరీలో చేర్చేసింది.

 Ranveer Singh To Star In Aparichit Sequel, Bollywood, Director Shankar, Ram Charan, Rrr Movie, Chiyaan Vikram-TeluguStop.com

ఇక ఈ సినిమాతోనే విక్రమ్ విలక్షణ నటుడుగా ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. కమల్ హసన్ తర్వాత ఆ స్థాయి నటుడుగా విక్రమ్ ప్రశంసలు అందుకోవడానికి కారణం అయిన సినిమా.

అలాగే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డుని కూడా విక్రమ్ కి తెచ్చిపెట్టిన సినిమా అపరిచితుడు.ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే దర్శకుడు శంకర్ సినిమా ఎండ్ లో ఎలివేట్ చేశాడు.

 Ranveer Singh To Star In Aparichit Sequel, Bollywood, Director Shankar, Ram Charan, RRR Movie, Chiyaan Vikram-అపరిచితుడు హిందీ రీమేక్ కోసం ఆ హీరో ప్రయత్నాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానికి సీక్వెల్ ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వర్క్ అవుట్ కావడం లేదు.ఇక ఈ సినిమా హిందీలో కూడా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాని అపరిచితుడు సీక్వెల్ ని హిందీలో ప్లాన్ చేయడం కోసం స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ నేపధ్యంలో రీసెంట్ గా దర్శకుడు శంకర్ ని కూడా ఈ హీరో కలవడం జరిగింది.

ఇక ఈ సీక్వెల్ సినిమాకి దర్శకత్వం వహించాలని శంకర్ ని రణవీర్ కోరినట్లు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం శంకర్ టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ నేపధ్యంలో అపరిచితుడు హిందీ అపరిచిత్ రీమేక్ పై శంకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.మరి 15 ఏళ్ల క్రితం తన దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని ఎన్నేళ్ళ తర్వాత హిందీలో సీక్వెల్ చేయడానికి శంకర్ ఒకే అంటాడా అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube