బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్, క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వారిలో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ జంట ఒకటి అని చెప్పవచ్చు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతూనే కెరియర్ పరంగా అద్భుతమైన సినిమాల్లో నటిస్తున్నారు.ఇలా వ్యక్తిగత విషయంలోనూ , వృత్తి విషయంలోనూ ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శం అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా రణవీర్ సింగ్ బుల్లితెరపై ప్రసారమయ్యే ‘ది బిగ్ పిక్చర్’ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.
ఈ ప్రోమోలో భాగంగా రణవీర్ సింగ్ మాట్లాడుతూ తనకు పుట్టబోయే పాప కోసం ఒక మంచి పేరును వెతుకుతున్నట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం దీపిక ప్రెగ్నెంటా అంటే కాదనే చెప్పాలి.
కలర్స్ టీవీలో ప్రసారం కాబోయే ఈ కార్యక్రమంలో రణవీర్ సింగ్ కంటెస్టెంట్ ల తో మాట్లాడుతూ… నాకు పెళ్లి జరిగిన అనే విషయం అందరికీ తెలిసిందే… మరొక రెండు మూడు సంవత్సరాలలో మేము ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకుంటున్నాము.అయితే మీ వదిన మాదిరి ఎంతో అందంగా, క్యూట్ గా ఉండే ఒక బిడ్డను తనకు ఇవ్వమని చెబుతున్నాను.ఆ పాప నా జీవితం లోకి వస్తే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా రణవీర్ సింగ్ తెలిపారు.అదేవిధంగా వారికి పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటినుంచి ఒక అందమైన పేరున వెతుకుతున్నట్లు ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో రణవీర్ ముచ్చటించినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే సూర్యవంశీ, ‘83’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.