భార్య రాగానే కండోమ్‌ యాడ్‌కు గుడ్‌ బై చెప్పిన స్టార్‌ హీరో  

Ranveer Singh Says Goodbye To Condom Ad After His Marriage-deepika Padukone,ranveer Singh,telugu Viral News,tollywood Gossips,viral In Social Media

బాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు ఒక చిన్న హీరోగా మాత్రమే ఉన్న రణ్‌ వీర్‌ సింగ్‌ గత సంవత్సర కాలంలోనే టాప్‌ స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఈయన చేసిన సినిమాలు వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను అందుకున్న నేపథ్యంలో రణ్‌ వీర్‌ సింగ్‌ ప్రస్తుతం స్టార్‌ హీరోలకు సైతం సవాల్‌ విసిరే స్థాయికి చేరాడు. వంద కోట్ల సినిమా అంటే అబ్బ అనుకున్న హీరో ఇప్పుడు వరుసగా తన అన్ని సినిమాలను వందల కోట్ల క్లబ్‌లో చేర్చుతున్నాడు...

భార్య రాగానే కండోమ్‌ యాడ్‌కు గుడ్‌ బై చెప్పిన స్టార్‌ హీరో-Ranveer Singh Says Goodbye To Condom Ad After His Marriage

భారీ ఎత్తున సక్సెస్‌లు అందుకుంటున్న రణ్‌ వీర్‌ సింగ్‌ తాజాగా తాను గత అయిదు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న కండోమ్‌ యాడ్‌కు గుడ్‌ బై చెప్పాడు.

హీరోగా పరిచయం అయిన సమయంలో రణ్‌ వీర్‌ సింగ్‌కు ప్రముఖ కండోమ్‌ కంపెనీ నుండి ఆఫర్‌ వచ్చింది. దానికి భారీ పారితోషికం కూడా ఆయనకు ఆఫర్‌ వచ్చింది. దాంతో ఆ సమయంలో కండోమ్‌ యాడ్‌కు ఓకే చెప్పి యాడ్స్‌ చేశాడు.

అయిదు సంవత్సరాల పాటు ఆ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. హీరోగా సక్సెస్‌ లు దక్కి, స్టార్‌డం దక్కడంతో పాటు తాజాగా స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునేను వివాహం చేసుకోవడం వంటి కారణాల వల్ల కండోమ్‌ యాడ్‌కు ఈ యంగ్‌ స్టార్‌ హీరో గుడ్‌ బై చెప్పాడు..

కండోమ్‌ యాడ్‌కు రణ్‌ వీర్‌ సింగ్‌ గుడ్‌ బై చెప్పడంపై సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీపిక పదుకునే ఒత్తిడి మేరకు రణ్‌ వీర్‌ సింగ్‌ తన కండోమ్‌ యాడ్‌కు గుడ్‌ బై చెప్పి ఉంటాడని, ఆయన ఇష్టాలను, ఆయన నిర్ణయాలను అప్పుడే దీపిక పదుకునే కాల రాసేందుకు ప్రయత్నాలు చేస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.

మొత్తానికి రణ్‌ వీర్‌ కండోమ్‌ యాడ్‌ గురించి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాత్రం ఒప్పందం పూర్తి అయిన కారణంగా తాను సదరు కంపెనీకి దూరం అయినట్లుగా ప్రకటించాడు...