భీష్మ హిందీ రీమేక్ లో రణవీర్ సింగ్

యంగ్ హీరో నితిన్ హీరోగా, వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా భీష్మ.కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత నితిన్ మరోసారి తన కెరియర్లో సాలిడ్ హిట్ కొట్టాడు.

 Ranveer Singh Lead In Bheeshma Hindi Remake, Bheeshma Movie, Ranveer Singh, Kara-TeluguStop.com

ఇక ఈ సినిమా ద్వారా తన కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ కూడా సాధించాడు.ఈ సినిమా నితిన్ కెరియర్ కి మరింత ఊపు అందించింది.

ఇదే స్పీడ్ లో ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలని నితిన్ లైన్ లో పెట్టాడు.అందులో ఒకటి వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రంగ్ దే సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

ఇది కూడా కామెడీ లవ్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కింది.ఈ సినిమాతో నితిన్ మరో హిట్ ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పటికే నితిన్ భీష్మ సినిమా అఫీషియల్ హిందీ రీమేక్ కన్ఫర్మ్ అయ్యింది.
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా కథలు ఎక్కువగా హిందీలో రీమేక్ అవుతున్నాయి.

ఇప్పుడు అదే దారిలో భీష్మ కూడా చేరింది.కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ కావడం ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకి కూడా కనెక్ట్ అవుతుంది.ఈ నేపధ్యంలో భీష్మ సినిమాలో నటించడం కోసం అక్కడి కుర్ర హీరోలు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.అయితే బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరో రణవీర్ సింగ్ ఈ సినిమాలో హీరోగా కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికీ ఈ సినిమా రణవీర్ చూడటం, అతనికి తెగ నచ్చేయడం జరిగిందని, అందుకే తనలోనే కామెడీ ఈజ్ ని మరోసారి ప్రెజెంట్ చేసుకోవడానికి ఈ సినిమా కరెక్ట్ అని భావించి ఒకే చెప్పాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు వెంకి కుడుముల బాలీవుడ్ లో అడుగు పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే రీమేక్ పనులు మొదలయ్యాయనే మాట వినిపిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube