కపిల్ దేవ్ లుక్ లో రణవీర్ సింగ్! సోషల్ మీడియాలో వైరల్

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.ఎక్కువగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు చేసేందుకు దర్శకులు, హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉండటంతో ఆ జోనర్ కథలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.

 Ranveer Singh In Kapil Dev Look-TeluguStop.com

మరో అరడజను సినిమాలకి పైగా ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాయి.అందులో క్రికెట్ నేపధ్యంలో 1983 ఇండియన్ వరల్డ్ కప్ నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ 83 చిత్రం కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నాడు.

సినిమా కోసం కపిల్‌దేవ్ మేనరిజమ్స్, స్టైల్స్ ను అనుకరిస్తున్న రణ్ వీర్ 83 సినిమాకి సంబంధించిన తన రెట్రో లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.కపిల్ తరహాలో జులపాలతో ఉన్న రణ్‌వీర్ లుక్ ఆకట్టుకుంటోంది.

ఈ రెట్రో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం రణవీర్ లుక్ సినిమాకి బూస్టింగ్ ఇచ్చింది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube