దక్షిణాది మార్కెట్ పై ఫోకస్ పెట్టిన బాలీవుడ్ క్రేజీ స్టార్  

ranveer singh focus on south indian market - Telugu Bollywood, Kollywood, Pan India Movies,, Tollywood

ఇప్పుడు ఇండియాలో సినిమా మార్కెట్ పరిధి విస్తరించింది.బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా మార్కెట్ లెక్కలు అన్ని కూడా ఒక్కసారిగా మారిపోయాయి.

TeluguStop.com - Ranveer Singh Focus On South Indian Market

స్టార్ హీరోల సినిమా బడ్జెట్ లు వంద కోట్లు దాటిపోవడంతో పాటు లాంగ్వేజ్ బారియర్స్ కూడా చెరిగిపోయాయి.దక్షిణాది సినిమాలు హిందీతో పాటు ఇతర భాషలకి వెళ్తున్నాయి.

అలాగే హిందీ సినిమాలు కూడా దక్షిణాది భాషలలో రిలీజ్ అవుతున్నాయి.ప్రేక్షకులు కూడా కంటెంట్ బాగుంటే భాష, నటులతో సంబంధం లేకుండా సినిమాని ఆదరిస్తున్నారు.

TeluguStop.com - దక్షిణాది మార్కెట్ పై ఫోకస్ పెట్టిన బాలీవుడ్ క్రేజీ స్టార్-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సౌత్ మార్కెట్ పై అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు మాత్రమే ఫోకస్ పెట్టి వారి సినిమాలు దక్షిణాది భాషలలో రిలీజ్ చేసేవారు.

అయితే ఇప్పుడు అక్కడ కుర్ర హీరోలు కూడా తమ మార్కెట్ రేంజ్ ని పెంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.

వారిలో రణవీర్ సింగ్ ముందు వరుసలో ఉన్నాడు.అతని భాజీరావ్ మస్తానీ సినిమా ఇప్పటికే తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అయ్యింది.

ఇక్కడి ప్రేక్షకులకి కూడా ఆకట్టుకుంది.ఇప్పుడు 2018లో తెలుగు చిత్రం టెంపర్‌ ని హిందీలో రీమేక్‌ చేసి సూపర్‌హిట్‌ అందుకున్నాడు.

ప్రస్తుతం ఈ హీరో 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నేపథ్య 83 చిత్రం తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా ప్రమోషన్ పై దృష్టి పెట్టాడు.

దీని తర్వాత యష్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లో రణ్‌వీర్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.ఈ సినిమాని కూడా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

యష్ రాజ్ సినిమాలతో దక్షిణాదిలో కూడా మంచి క్రేజ్ ఉండటంతో దానిని ప్లస్ చేసుకోవడానికి రణవీర్ ప్లాన్ చేస్తున్నాడు.

#RanveerSingh #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ranveer Singh Focus On South Indian Market Related Telugu News,Photos/Pics,Images..