ట్రైలర్ రిలీజ్ కు ఆలస్యంగా వచ్చాడని హీరో చేతనే గుంజీలు  

Ranveer Singh Arriving Late To Suryavanshi Trailer Launch Then Akshay Kumar Reacts - Telugu Power Full Police, Ranaver, Ranveer Singh, , Rohith Shetty And Akshay Kumar

రోహిత్ శెట్టి దర్శకత్వం లో అక్షయ్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘సూర్య వంశీ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వగా ఈనెల 24 న ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది.

Ranveer Singh Arriving Late To Suryavanshi Trailer Launch Then Akshay Kumar Reacts

అయితే ఈ సినిమా కు సంబందించిన ట్రైలర్ కూడా నిన్న విడుదల అవ్వగా సోషల్ మీడియా ను షేక్ చేసేసింది.చాలా కాలం తరువాత అక్షయ్ కుమార్ ఫుల్ లెంగ్త్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా అజయ్ దేవ్ గణ్,రణ్ వీర్ సింగ్ లు కూడా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

అయితే నిన్న రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్కార్యక్రమానికి రణ్ వీర్ 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు.దీనితో అక్షయ్ రణ్ వీర్ ఆలస్యంగా వచ్చినందుకు క్రమశిక్షణ లేదంటూ సరదాగా గుంజీలు తీయించాడు.

అయితే ఈ దృశ్యాలు రికార్డ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి రణ్ వీర్ 40 నిమిషిలు ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా గుంజీలు తీయాల్సిందే అని అక్షయ్ పట్టుబట్టడం తో దానికి అజయ్ దేవ్‌గణ్.

పోనిలే పాపం క్షమించు.తన భార్య ఇంట్లో ఉంది కనుక అందుకే ఆలస్యమైనట్టు ఉంది అంటూ వ్యాఖ్యానించాడు.

అయితే వెంటనే దానికి సమాధానంగా రణ్‌వీర్ నా భార్య దీపికా.ఇంట్లోనే ఉంది.కానీ టైమ్ విషయంలో ఖచ్చితంగా ఉంటుంది అంటూ ఫన్ని కామెంట్ చేసాడు.ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ముంబాయి‌లో ఇప్పటి వరకు జరిగిన బాంబ్ బ్లాస్ట్స్ నేపథ్యంలో దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test