భార్యతో ఎన్‌సీబీ విచారణకు హాజరవ్వాలనుకుంటున్న స్టార్‌ హీరో  

Ranveer Singh Requests NCB Officials to attend Deepika Padukone Interrogation, Ranveer Singh, Deepika Padukone Interrogation, NCB Officials,Drugs Probe - Telugu Deepika Padukone Interrogation, Drugs Probe, Ncb Officials, Ranveer Singh, Ranveer Singh Requests Ncb Officials To Attend Deepika Padukone Interrogation

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కు డ్రగ్స్ కేసులో సంబంధం ఉందనే అనుమానంతో ఎన్‌సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.ఆమె అధికారుల ముందు హాజరై తన వాదనను వినిపించాల్సి ఉంది.

TeluguStop.com - Ranveer Sing Deepika Padukone Ncb Officials Questioning

కేసులో ఎన్‌సీఈ అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది.ఆమె అధికారుల ముందు హాజరయ్యేందుకు రెడీ అయ్యారు.

రేపు ఆమె అధికారుల ముందు హాజరు అయ్యేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఆమె భర్త రణ్‌ వీర్‌ సింగ్‌ అధికారులకు విజ్ఞప్తి చేశాడు.తన భార్యతో తోడుగా తాను కూడా విచారణకు హాజరు అవ్వచ్చా అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

TeluguStop.com - భార్యతో ఎన్‌సీబీ విచారణకు హాజరవ్వాలనుకుంటున్న స్టార్‌ హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందుకు అధికారులు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.నేడు ఎన్సీబీ అధికారుల ముందు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హాజరు అయ్యింది.

నేడు వారిని విచారించిన తర్వాత కీలక విషయాలను అధికారులు రాబట్టే అవకాశం ఉంది.ఆ తర్వాత దీపిక పదుకునేను విచారించేందుకు ఇప్పటికే ఆమెకు తేదీని ఇచ్చారు.

డ్రగ్స్‌ కేసులో ఈమె పేరు ఎలా వచ్చింది అంటూ అంతా కూడా అవాక్కవుతున్నారు.

ఈ కేసుతో ఆమెకు ఏమాత్రం సంబంధం ఉందని వెళ్లడి అయినా కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తితో పాటు కొందరు డ్రగ్స్‌ డీలర్లు అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే.ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసేందుకు ఎన్‌సీబీ అధికారులు రెడీ చేస్తున్నారు.

ఈ కేసుతో మొత్తం వంద మంది వరకు సంబంధం ఉంది అన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ముందు ముందు మరెంత మంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి.

#Ranveer Singh #DeepikaPadukone #RanveerSingh #NCB Officials #Drugs Probe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ranveer Sing Deepika Padukone Ncb Officials Questioning Related Telugu News,Photos/Pics,Images..