అమావాస్యరోజు ముగ్గులు ఎందుకు వేయకూడదు?  

Rangoli Will Not Do On Amavasya Day -

సాధారణంగా ప్రతి ఇంటిలో మహిళలు ఉదయం లేవగానే ఇంటి ముందు ఉన్న చెత్తను ఊడిచేసి నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గులు వేయటం జరుగుతూనే ఉంటుంది.దాంతో ఇంటి ముందు ప్రాంతం అంతా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

అయితే పండితులు అమావాస్య రోజున ముగ్గులు వేయకూడదని చెప్పుతున్నారు.

Rangoli Will Not Do On Amavasya Day-Devotional-Telugu Tollywood Photo Image

అమావాస్య ముందు రోజున ఇంటికి పితృ దేవతలు వస్తారు.

అందువలన ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమిస్తే.వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్పుతున్నారు .ఆరోజు ఇంటిముందు వున్న చెత్తను శుభ్రం చేసుకుని, నీటిని చల్లుకోవచ్చు కానీ ముగ్గులు ఎట్టి పరిస్థితిలో వేయకూడదని చెప్పుతున్నారు పండితులు.

ఒకవేళ ముగ్గులు వేస్తె పితృ దేవతలు రాకుండా ఇంటి బయట వాకిలిలోనే ఆగిపోతారు.

అందువలన అమావాస్య రోజున పితృ దేవతలను మనసారా ప్రార్ధించాలని పండితులు అంటున్నారు.పితృ దేవతలకు అమావాస్య చాలా ప్రీతికరమైన రోజు.

ఆ రోజు పితృ దేవతలను కొలిస్తే సకల సంపదలు కలుగుతాయని పండితులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL