'రంగ్‌ దే' లిరికల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ కు కొత్త డేట్‌ ఫిక్స్‌..!

యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా రంగ్ దే.సూర్యదేవర నాగవంశీ ఆధ్వర్యంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాని పిడివి ప్రసాద్ సమర్పిస్తున్నారు.ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తుండగా ఆయన సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇక అసలు విషయంలోకి వెళితే.
ఇదివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు అలాగే మొదటగా లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం.అయితే ఈ పాటకు వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సిద్ధమైన తరుణంలో సినిమా సమర్పకుడు ప్రసాద్ భార్య గుండెపోటు కారణంగా మృతి చెందడంతో ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

 Rangde Movie Emito Idhi Lyrical Video Song Release Date-TeluguStop.com

అయితే మళ్లీ ఈ పాటకు సంబంధించి వీడియోను ఎప్పుడు విడుదల చేస్తారో తేదీని ప్రకటించింది.

తాజాగా ఈ లిరికల్ వీడియో రిలీజ్ డేట్ నవంబర్ 12 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలియజేశారు.

 Rangde Movie Emito Idhi Lyrical Video Song Release Date-రంగ్‌ దే’ లిరికల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ కు కొత్త డేట్‌ ఫిక్స్‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నితిన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, కౌసల్య, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, వినీత్ మొదలైన వారు ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ గా పి.సి.శ్రీరామ్ సేవలందిస్తున్నారు.లాక్ డౌన్ ముందు భీష్మ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ అందరినీ అలరించాడు.మరోసారి రంగ్ దే అంటూ ప్రేక్షకులందరికీ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

చూడాలి మరి ఈ సారి ఏవిధంగా హీరో నితిన్ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో.

#Keerthy Suresh #Video Song #Rang De Movie #EmitoIdhi #RangDe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు