పెళ్లి చేసుకుని తప్పు చేశానంటున్న జబర్దస్త్ కమెడియన్...  

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ అయిన ఈ టీవీలో ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకి ప్రసారం అయ్యే  “క్యాష్ – దొరికినంత దోచుకో” ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి వారం యాంకర్ సుమ సెలబ్రిటీలను తీసుకొచ్చి సందడి చేస్తున్న కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎప్పటిలాగే ఈ వారం ఈ షో లో నలుగురు సెలెబ్రిటీలు పాల్గొన్నారు. వారు ఎవరో కాదు రంగస్థలం మహేష్, వైవా హర్ష, జోష్ రవి, సుదర్శన్.అయితే వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమో  ని తాజాగా షో నిర్వాహకులు యూట్యూబ్ లో విడుదల చేశారు.

TeluguStop.com - Rangasthalam Mahesh Sensational Comments On His Marriage

అయితే ఈ ప్రోమో లో సుమ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మహేష్ ని సుమ ఈ రెండింటిలో ఏది చేసి తప్పు చేశానని ఫీల్ అయ్యారని ఒకటి పెళ్లి చేసుకోవడం, రెండవది సినిమా యాక్టర్ అవ్వడం అని అడగగా మహేష్ ఆచంట వెంటనే పెళ్లి చేసుకుని తప్పు చేశాననని అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.

దాంతో సుమ ఏకంగా బ్రేకింగ్ న్యూస్ పెళ్లి చేసుకుని తప్పు చేశానని అంటున్న మహేష్ అంటూ అందరిని ఒక్కసారిగా నవ్వించింది. ఆ తర్వాత మహేష్ భార్య పావని కి ఫోన్ చేసి మీ ఆయన గురించి తెలియజేయండని అడగ్గా  పావని తన భర్త గురించి తెలియజేతూ మా అయన “వరల్డ్ బెస్ట్ హస్బెండ్”  అని చెప్పుకొచ్చింది.

TeluguStop.com - పెళ్లి చేసుకుని తప్పు చేశానంటున్న జబర్దస్త్ కమెడియన్…-General-Telugu-Telugu Tollywood Photo Image

 దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో మహేష్ రంగస్థలం, శతమానం భవతి, గుణ 369, మహానటి, తదితర చిత్రాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

  దీంతో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.

#Pavani Achanta #Mahesh Achanta #MaheshAchanta #Cash Program #Rangasthalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు