కన్నడ నాట సంచలనంగా మారుతున్న మెగా హీరో రామ్ చరణ్  

Rangasthalam Kannada Dubbing Movie Also Got Hit Talk-

మెగాస్టార్ వారసుడుగా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసి అతి తక్కువ టైంలోనే స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఒక్క ఆరెంజ్ సినిమా తప్ప మొత్తం అన్ని హిట్, సూపర్ హిట్ సినిమాలుగానే నిలిచాయి.కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్న రామ్ చరణ్ కెరియర్ లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

Rangasthalam Kannada Dubbing Movie Also Got Hit Talk--Rangasthalam Kannada Dubbing Movie Also Got Hit Talk-

ఓ విధంగా చెప్పాలంటే మగధీర తర్వాత రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా రంగస్థలం నిలిచింది అని చెప్పాలి.ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఏడాది క్రితం రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్న రంగస్థలం తెలుగులో నుంచి మాయాబజార్ సినిమా తర్వాత కన్నడంలో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్న సినిమాగా నిలిచింది.

Rangasthalam Kannada Dubbing Movie Also Got Hit Talk--Rangasthalam Kannada Dubbing Movie Also Got Hit Talk-

ఇప్పటికే కన్నడ ప్రజలు కూడా రంగస్థలం సినిమా చూసిన, తమ ప్రాంతీయ భాషలో మరో సారి రిలీజ్ అవుతూ ఉండటంతో పాటు, అక్కడ కూడా మెగా హీరోలని ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో రిలీజ్ కి ముందే మంచి హైప్ సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కర్ణాటకలో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.

దీంతో ఇప్పటికే థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి.కన్నడ సినిమాలు చాలా కాలంగా తెలుగులో రిలీజ్ అవుతున్న నేపధ్యంలో రంగస్థలం సినిమాకి అక్కడ మార్కెట్ పెంచుకునే అవకాశం వచ్చింది.మరి కన్నడలో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రంగస్థల సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.