‘రంగస్థలం’ వల్ల వారికి భారీ నష్టం     2018-05-18   02:47:24  IST  Raghu V

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో ఈ చిత్రం దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది. ఇంతటి భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. ఈ మద్య స్టార్‌ హీరోల సినిమాల డిజిటల్‌ రైట్స్‌ను అమెజాన్‌ భారీ మొత్తాలకు కొనుగోలు చేస్తూ ఉంది. అన్ని సినిమాల మాదిరిగానే రంగస్థలం చిత్రంపై వచ్చిన అంచనాలు మరియు సాధించిన విజయం నేపథ్యంతో భారీ మొత్తంను వ్యచ్చించడం జరిగింది.

‘రంగస్థలం’ చిత్రం తమకు భారీగా వసూళ్లు చేసి పెడుతుందని భావించిన అమెజాన్‌కు ఊహించని షాక్‌ ఎదురైనట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రంగస్థలం విడుదలైన అయిదు వారాల్లోనే అమెజాన్‌లో ప్రైమ్‌ వీడియో విడుదల చేయడం జరిగింది. ప్రైమ్‌ వీడియోను ఫ్రీగా చూసే అవకాశం లేదు. సినిమాను చూడాలి అంటే ప్రేక్షకులు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించగా వచ్చే మొత్తం పూర్తిగా అమెజాన్‌ ఖాతాలోకి వెళ్తుంది. కాని రంగస్థలం చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.