రంగస్థలంకు పెట్టింది ఎంత? వచ్చింది ఎంతో తెలిస్తే షాక్‌!!       2018-05-08   06:09:42  IST  Raghu V

రామ్‌ చరణ్‌ హీరోగా సమంత హీరోయిన్‌గా సుకుమార్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రంగస్థలం’. సమ్మర్‌ సీజన్‌ ఈ చిత్రంతోనే ప్రారంభం అయ్యింది. అందరు ఆశించినట్లుగా ఈ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో చోటు చేసుకుంది. బాహుబలి తర్వాత 200 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా రంగస్థలం రికార్డు సాధించింది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 120 కోట్ల షేర్‌ను దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతూనే ఉంది. దాంతో ఈ మొత్తం షేర్‌ కలెక్షన్స్‌ పెరిగే అవకాశం ఉంది.

సుకుమార్‌ ఈ చిత్రంను దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లుగా తెలుస్తోంది. పారితోషికంతో పాటు, ఒక భారీ విలేజ్‌ సెట్టింగ్‌కు ఎక్కువ ఖర్చు అయ్యింది. ఇక ఈ చిత్రం అంతా కూడా ఆ సెట్టింగ్‌లో మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కింది. దాంతో ఫారిన్‌ షెడ్యూల్‌ ఖర్చు తప్పింది. అంతా కలిపి 50 కోట్ల లోపులోనే ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ పూర్తి చేశాడు అంటూ సమాచారం అందుతుంది. మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రం 80 కోట్ల థియేట్రికల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం 120 కోట్లు వసూళ్లు చేసింది.

డిస్ట్రిబ్యూటర్లకు ఈ చిత్రం భారీగా లాభాలను కురిపించి పెట్టింది. దాంతో పాటు నిర్మాత కూడా రికార్డు స్థాయిలో లాభాలను దక్కించుకున్నట్లుగా ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు దాదాపు 40 కోట్ల లాభాలు వచ్చాయి. ఆ లాభంలో 20 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు మరియు 20 కోట్లు నిర్మాతకు దక్కినట్లుగా తెలుస్తోంది. ఇక నిర్మాతలు ఆన్‌ లైన్‌ రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌, యూట్యూబ్‌ రైట్స్‌ ఇలా అనేక రకాల రైట్స్‌ను అమ్మడం జరిగింది. దాంతో చిత్రానికి 40 కోట్ల మేరకు అదనపు ఆధాయం దక్కింది. అంటే నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా విడుదలకు ముందు 80 కోట్లు, విడుదల తర్వాత 20 కోట్లు, ఇతర రైట్స్‌ ద్వారా 40 కోట్లు లాభం చేకూరిందని తెలుస్తోంది.

మొత్తం సినిమాకు 140 కోట్ల మేరకు బిజినెస్‌ అయ్యింది. సినిమాకు 50 కోట్లు బడ్జెట్‌ పెట్టారు కనుక నిర్మాతలు ఈ చిత్రం ద్వారా 90 కోట్ల మేరకు జేబులో వేసుకున్నట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. రంగస్థలం చిత్రంతో నిర్మాతలు దక్కించుకున్న లాభాలు ప్రస్తుతం ట్రేడ్‌ పండితులను సైతం ఆశ్చర్యంకు గురి చేస్తున్నాయి. రంగస్థలం కంటే ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికి ఆ చిత్ర నిర్మాతలకు ఇంతగా లాభాలు రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.