రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. !

ఈ మధ్యకాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గమనిస్తే ఎక్కువగా నిర్లక్ష్యం, మరియు అతివేగం వల్ల జరుగుతున్నాయని తేలిందట.ఇక నేడు యువత చేతికి వాహనం దొరికితే చాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత ఆనందం కలుగుతుంది.

 Rangareddy District Road Accident At Shadh Nagar Highway-TeluguStop.com

ఆ పట్టరాని సంతోషంలో వాహనాన్ని ఎంత వేగంలో నడుపుతున్నారో కూడా చూసుకోరు.

ఇకపోతే ఇలాగే వేగంగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది.

 Rangareddy District Road Accident At Shadh Nagar Highway-రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

షాద్ నగర్ జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆ వివరాలు చూస్తే.హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న షిఫ్ట్ కారు అన్నారం వై జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.ఈ సంఘటనలో ఓ బాలుడితో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు.

కాగా ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు చేపలు పట్టేందుకు సరదాగా వెళుతూ వీరు ప్రమాదానికి గురైనట్లు ప్రాధమిక సమాచారం అందింది.ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

#Road Accident #Highway #Shadh Nagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు