పండగ కలిసి వచ్చింది.. కానీ ముందు ముందు ఎలా ఉంటుందో?

ఉగాది ( Ugadi ) సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ చిత్రం( Rangamarthanda ) వచ్చింది.మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ అద్భుతమైన నటన తో ప్రేక్షకులను కట్టిపడేశారంటూ రివ్యూలు వచ్చాయి.

 Rangamartanda And Das Ka Damki Movie Collections Details, Das Ka Dhamki, Krishna-TeluguStop.com

కీలక పాత్రలో శివాత్మిక రాజశేఖర్ సినిమా లో మంచి నటనను కనబరిచి మెప్పించింది.ఇక మరో సినిమా దాస్ కా దమ్కీ( Das Ka Dhamki ) కూడా ఉగాది కానకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ రెండు సినిమాలు మొదటి రోజు సెలవు మరియు పండుగ అవడం తో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టాయి.

ముఖ్యంగా రంగమార్తాండ చిత్రం పాజిటివ్ టాక్ తో పాటు పాజిటివ్ కలెక్షన్స్ దక్కించుకుంది.అంతే కాకుండా గత వారం విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ రాబట్టలేక పోయాయి.కనుక చూడడానికి మరే సినిమాలు లేక పోవడం తో ప్రేక్షకులు ఈ రెండు సినిమాల థియేటర్ల వైపు అడుగులు వేశారు.

సెలవు రోజు అది కాకుండా పండగ రోజు అవ్వడంతో రెండు సినిమాలకు బాగానే నిన్న బాగానే కలెక్షన్స్ వచ్చాయి.మరి నేటి నుండి పరిస్థితి ఎలా ఉంటుంది, వీకెండ్ లో సినిమా కు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయి.

వీక్ డేస్ లో సినిమాల కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.పండగ తర్వాత రాబోతున్న సినిమాలు వీటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.కనుక ఈ లోపే ఈ చిత్రాలు సాధ్యమైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవాల్సి ఉంటుందని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాని దసరా చిత్రం ఈ నెల చివర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

కృష్ణ వంశీ దర్శకత్వంలో చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా అవ్వడం తో ఆయన అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube