ప్రాణాలను రిస్క్ లో పెట్టేసిన నాగశౌర్య... అసలు విషయం చెప్పిన డైరెక్టర్?

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం రంగ బలి.నూతన దర్శకుడు పవన్ బసం శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

 Rangabali Director Pawan Basamsetti Shares Naga Shaurya Illness Situation In Sho-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొని మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నఫలంగా నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోయిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈయన వివాహం కేవలం వారం రోజులు ఉందనగా నాగశౌర్య షూటింగ్ లొకేషన్లో కల్లు తిరిగి పడిపోవడమే కాకుండా రెండు రోజులపాటు హాస్పిటల్లో అడ్మిట్ కూడా అయ్యారు.ఇలా పెళ్లి సమయంలో ఈయన అస్వస్థతకు గురికావడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే అలా ఆయన అనారోగ్యానికి గురికావడానికి కారణమేంటి అంటూ డైరెక్టర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు డైరెక్టర్ సమాధానం చెబుతూ ఈ సినిమాలోని ఫస్ట్ ఫైట్ సన్నివేశం కోసం హీరోకి సిక్స్ ప్యాక్ బాడీ అవసరం అని చెప్పాము.

Telugu Illness, Naga Shaurya, Rangabali-Movie

ఇలా చెప్పడంతో నాగశౌర్య రెండు రోజులపాటు నీళ్లు కూడా తాగకుండా ఉన్నారు.ఇలా నీళ్లు తాగకుండా షూటింగ్లో పాల్గొన్నారు.ఇలా ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో నాగశౌర్య గట్టిగా ఊపిరి తీసుకోవడాన్ని తాను గమనించానని ఆ క్షణమే షూటింగ్ ఆపేసి ఈరోజుకు చాలు మీరు వెళ్ళండి అని తనని పంపించాను అలా తనని పంపించిన కాసేపటికి కళ్ళు తిరిగి పడిపోయారని తెలిసి వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాము.నాగశౌర్యను పరీక్షించిన డాక్టర్లు కాస్త ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం వచ్చి ఉండేదని చెప్పారంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ బసంశెట్టి నాగశౌర్య అనారోగ్యంగురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube