నితిన్‌కు పెళ్లి గిఫ్ట్ ఇస్తోన్న రంగ్ దే

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం పెళ్లికి రెడీ అయ్యాడు.షాలిని రెడ్డితో నితిన్ వివాహం జూలై 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Rang De Team To Give Marriage Gift To Nithiin, Rang De, Nithiin, Shalini Reddy,-TeluguStop.com

ఇప్పటికే వివాహ వేడుకలు జోరందుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు నితిన్‌కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయనకు గిఫ్టులు కూడా ఇస్తున్నారు.

కాగా తాజాగా నితిన్ వివాహం కానుకగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగ్‌దే చిత్ర యూనిట్ కూడా ఓ అదిరిపోయే గిఫ్టును రెడీ చేస్తున్నారు.

నితిన్-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రంగ్ దే చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న కానుకను నితిన్ పెళ్లి కానుకగా ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.నితిన్ భీష్మ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న తరువాత ఈ సినిమా చేస్తుండటంతో ‘రంగ్‌దే’పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరి నితిన్ పెళ్లికి రంగ్ దే టీమ్ ఇవ్వబోతున్న ఆ గిఫ్టు ఏమిటో తెలియాలంటే జూలై 26 సాయంత్రం 4 గంటల వరకు ఆగాల్సిందే.ఈ సినిమా యూరప్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకునేందుకు అక్కడికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

కానీ కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.ఈ సినిమాతో కీర్తి సురేష్ మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube