'కీర్తి సురేష్' ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన 'రంగ్ దే' చిత్ర బృందం..!

నేడు హీరోయిన్ కీర్తిసురేష్ పుట్టినరోజు సందర్భంగా రంగ్ దే చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది.ఈ సందర్భంగా కీర్తి సురేష్ ఉన్న చిత్రాన్ని రంగ్ దే సినిమా బృందం విడుదల చేసింది.

 Rang De Team Releases Keerthy Suresh Bday Poster-TeluguStop.com

చిరునవ్వులు లోలికిస్తు ఉన్న ముఖంతో కీర్తి సురేష్ ఫోటో ను చిత్ర బృందం విడుదల చేసింది.తాజాగా కొద్ది విరామం తీసుకున్న ఈ చిత్రబృందం మళ్లీ హైదరాబాద్ ప్రాంతంలో షూటింగ్ ప్రక్రియను మొదలు పెట్టింది.

హీరో నితిన్ తో సహా ప్రధాన తారాగణం మొత్తం షూటింగ్ లో పాల్గొంటుంది.ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

 Rang De Team Releases Keerthy Suresh Bday Poster-కీర్తి సురేష్’ ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన రంగ్ దే’ చిత్ర బృందం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం సేఫ్టీ మెజర్స్ ను పాటిస్తూ చిత్రబృందం సినిమాని షూట్ చేస్తోంది.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అక్టోబర్ నెల చివరి వారంలో కొన్ని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ కోసం ఇటలీలో కొద్దిరోజులు షూటింగ్ జరుపుతున్నారు.

ఇక ఆ తర్వాత సినిమాను 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఇకపోతే హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ మొట్టమొదటిసారిగా కలిసి నటించబోతున్న సినిమా రంగ్ దే.
ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.మజ్ను, తొలిప్రేమ లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం బాధ్యతలు వహిస్తున్నారు.

సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పి.సి.శ్రీరామ్ ఈ సినిమాని కి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ తో పాటుగా అనేక మంది ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

ఇందులో సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్, రోహిణి, వినీత్, బ్రహ్మాజీ, కౌసల్య లాంటి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

#Keerthy Suresh #Rang De Movie #Birthday Wishes #Nithin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు