నితిన్‌కు చుక్కలు చూపెడుతున్న కరోనా  

Rang De Team Italy Tour Cancelled, Nithiin, Keerthy Suresh, Rang De, Italy Tour, Tollywood News - Telugu Italy Tour, Keerthy Suresh, Nithiin, Rang De, Tollywood News

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకున్నప్పుడు ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది.కానీ వారి ప్లాన్‌కు కరోనా అడ్డుపడింది.

TeluguStop.com - Rang De Team Italy Tour Cancelled

ఏకంగా ఆరు నెలలకు పైగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు.అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి చిత్ర యూనిట్ ప్రారంభించింది.

ఇక ఈ సినిమాకు మరోసారి కరోనా దెబ్బేసింది.

TeluguStop.com - నితిన్‌కు చుక్కలు చూపెడుతున్న కరోనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాజాగా ఈ సినిమా షెడ్యూల్‌ను ఇటలీలో జరుపుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ షెడ్యూల్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడికి పయనం అయ్యేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.అయితే చివరి నిమిషంలో ‘రంగ్ దే’ చిత్ర యూనిట్ ఇటలీ టూర్ రద్దు అయ్యింది.

ప్రస్తుతం కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఇటలీ దేశంలో పలు ఆంక్షలు విధించారు.అక్కడ సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించకపోవడంతో రంగ్ దే చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లకుండా ఆగిపోయింది.

దీంతో నితిన్ అండ్ టీమ్ ఇప్పుడు మరోసారి డైలమాలో పడిపోయారు.

చివరి నిమిషంలో ఇటలీ టూర్ క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు వేరే దేశంలో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలో దుబాయ్‌లో అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఏదేమైనా నితిన్ నటిస్తున్న ‘రంగ్ దే’ చిత్రానికి కరోనా తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా తీవ్ర ఆలస్యం కాగా, ఇప్పుడు మరోసారి ఈ సినిమా షూటింగ్‌కు అడ్డంకిగా కరోనా మారడంతో నితిన్ అండ్ టీమ్ ఆలోచనలో పడ్డారు.ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

#Keerthy Suresh #Rang De #Italy Tour #Nithiin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rang De Team Italy Tour Cancelled Related Telugu News,Photos/Pics,Images..