ఇంకా పూర్తి కాకుండానే ఈ రచ్చ ఏంటో  

Discussion About Nithin Rang De Movie Release In Ott, Rang De, Nithin, Keerthi Suresh, OTT - Telugu Keerthi Suresh, Nithin, Ott, Rang De

నితిన్‌, కీర్తి సురేష్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగ్‌ దే’ సినిమాను అన్ని బాగుంటే ఈ ఏడాది జులై 31న విడుదల చేయాలనుకున్నారు.కాని కరోనా కారణంగా మొత్తం తలకిందులు అయ్యింది.

TeluguStop.com - Rang De Nithin Keerthi Suresh Ott

సినిమా ఇంకా నెల రోజుల షూటింగ్‌ ఉంది.అది కూడా విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది.

ఇలాంటి సమయంలో సినిమాను విడుదల గురించి రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి.గత నెల రోజులుగా ఓటీటీలో తెలుగు పెద్ద సినిమాల విడుదల అంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.

TeluguStop.com - ఇంకా పూర్తి కాకుండానే ఈ రచ్చ ఏంటో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పటి వరకు షూటింగ్‌ కూడా పూర్తి కాని సినిమా గురించి మరీ ఇంత రచ్చ ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వడం లేదు అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

సినిమాల విషయంలో ఈమద్య కాలంలో ఓటీటీలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

అందుకే ఈ సినిమాను కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయట.కాని ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ విషయంలో క్లారిటీ రాలేదు.

ఎప్పటికి పూర్తి చేసి ఫస్ట్‌ కాపీ వచ్చేనో తెలియదు.కనుక ఇప్పటి నుండే ఎలా ఓటీటీ చర్చలు జరుపుతాం అనుకుంటున్నారు.

సినిమా షూటింగ్‌ కోసం వచ్చే నెలలో యూరప్‌కు యూనిట్‌ సభ్యులు వెళ్తారనే సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి.

యూత్‌ ఆడియన్స్‌ ను అమితంగా ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని అంతా నమ్ముతున్నారు.అన్ని వర్గాల వారి అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించి ఉంటాడు అనే నమ్మకం అందరి లో వ్యక్తం అవుతుంది.

ఇప్పటికే విడుదలైన ఒక వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. కీర్తి సురేష్‌ ను ఇష్టం లేకుండా ఏడ్చుకుంటూ పెళ్లి చేసుకుంటాడు నితిన్‌.ఎందుకు అంత ఇబ్బందిగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం అయ్యి ఉంటుందో అంటూ ప్రేక్షకుల్లో ఆలోచన మొదలైంది.కనుక సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్‌ ఉంది.

#Nithin #Keerthi Suresh #Rang De

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rang De Nithin Keerthi Suresh Ott Related Telugu News,Photos/Pics,Images..