అదిరిపోయే రేటుకు రంగ్‌దే డిజిటల్ రైట్స్  

Rang De Nithiin Keerthy Suresh Venky Kudumula - Telugu Keerthy Suresh, Nithiin, Rang De, Telugu Movie News, Venky Kudumula

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నితిన్ అదే జోరులో తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు.

 Rang De Nithiin Keerthy Suresh Venky Kudumula

దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు నితిన్.

ఈ సినిమాకు రంగ్‌దే అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ వాయిదా వేసుకుంది.

అదిరిపోయే రేటుకు రంగ్‌దే డిజిటల్ రైట్స్-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.దీంతో ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.

కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

రంగ్‌దే చిత్రం డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్‌ ఏకంగా రూ.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఇంత మొత్తంలో నితిన్ సినిమా అమ్ముడు కావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేద్దామని అనుకున్నా, ప్రస్తుత పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాదని చిత్ర యూనిట్ అంటోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు