ఒటీటీలో రిలీజ్ కి రెడీ అవుతున్న రంగ్ దే... డేట్ ఫిక్స్

యూత్ స్టార్ నితిన్ ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.అస్సలు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు.

 Rang De Movie Ott Release Date Fixed-TeluguStop.com

ఈ ఏడాది రంగ్ దే, చెక్ మూవీలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులని నిరుత్సాహ పరిచాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అందాధున్ రీమేక్ గా మేస్ట్రో మూవీలో నటిస్తున్నాడు.ఈ మూవీ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు.

 Rang De Movie Ott Release Date Fixed-ఒటీటీలో రిలీజ్ కి రెడీ అవుతున్న రంగ్ దే… డేట్ ఫిక్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో పాటు కృష్ణ చైతన్యతో పవర్ పేటర్ సిరీస్ ఉంది.వీటితో పాటు మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్, నితిన్ జోడీగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి భారీ అంచనాల మధ్య వచ్చిన రంగ్ దే మూవీ రొటీన్ కాన్సెప్ట్ తో ఎవరేజ్ మూవీగా మిగిలిపోయింది.ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ భాగానే ఉన్న థియేటర్ లో ప్రేక్షకుల ని అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతుంది.జీ5 ఈ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో జూన్ 12న రంగ్ దే డిజిటల్ రిలీజ్ డేట్ ని ఛానల్ ఎనౌన్స్ చేసింది.మరి థియేటర్ ప్రేక్షకులని ఆకత్తుకొని రంగ్ దే డిజిటల్ ఆడియన్స్ ని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే చెక్ మూవీ కూడా ఇప్పటికే డిజిటల్ లో రిలీజ్ అయ్యింది.అయితే థియేటర్ లో వచ్చిన రిజల్ట్ ఒటీటీలో కూడా ఆ మూవీకి రావడం గమనార్హం.

#Venki Atluri #Rang De Movie #Keerthi Suresh #Hero Nithiin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు