బుల్లితెరపై తన హిట్ సినిమా ని రంగ్ దే తో బీట్ చేసిన నితిన్

సిల్వర్ స్క్రీన్ పై హిట్ అయిన సినిమాలు కొన్ని బుల్లితెరపై అంతగా ప్రభావం చూపించవు.ఛానల్స్ వారు శాటిలైట్ హక్కులని హీరో రేంజ్ బట్టి భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకుంటారు.

 Rang De Movie Good Trp Rating In Television Screens-TeluguStop.com

అయితే కొన్ని సినిమాల విషయంలో ఛానల్స్ వారికి పెట్టిన పెట్టుబడి వర్క్ అవుట్ అవుతుంది.ఒక్కోసారి మాత్రం థియేటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న టీవీ ప్రేక్షకులకి మాత్రం ఆ సినిమాలు కనెక్ట్ కాకపోవడం అనుకున్న స్థాయిలో రేటింగ్స్ రావు.

దీంతో శాటిలైట్ హక్కుల విషయంలో వారికి నష్టాలు తప్పవు.

 Rang De Movie Good Trp Rating In Television Screens-బుల్లితెరపై తన హిట్ సినిమా ని రంగ్ దే తో బీట్ చేసిన నితిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బిగ్ స్క్రీన్ పై ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు బుల్లితెరపై గ్రాండ్ విక్టరీని కొట్టడంతో పాటు ఊహించని స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంటాయి.

మహేష్ బాబు అతడు సినిమా థియేటర్ లో పెద్దగా హిట్ కాలేదు.కాని టీవీలో వేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.తాజాగా నితిన్ రంగ్ దే మూవీకి కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది.నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ థియేటర్ లో ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు.

అయితే బుల్లితెరపై మాత్రం ఏకంగా 7 టీఆర్పీ పాయింట్స్ తెచ్చుకొని పరవాలేదనిపించుకుంది.నితిన్ సూపర్ హిట్ మూవీ భీష్మ బుల్లితెరపై కేవం 6.7 టీఆర్పీ రేటింగ్ మాత్రమే తెచ్చుకోగా రంగ్ దే మూవీ దానిని బీట్ చేయడం విశేషం.బ్లాక్ బస్టర్ మూవీ కంటే ఫ్లాప్ మూవీకి టీవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని దీనిని బట్టి అర్ధమవుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీ ఒటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.దీనికి సంబందించిన డీల్ కూడా ఇప్పటికే క్లోజ్ అయినట్లు బోగట్టా.

#Venki Atluri #Screens #Rang #Nithiin #Keerthi Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు