నితిన్ రంగ్ దే సినిమాకి 40 కోట్ల బిజినెస్

నితిన్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే.ఈ సినిమాలో చాలా గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

 Rang De Movie Business Expectations 40 Crores, Tollywood, Hero Nithiin, Keerthi-TeluguStop.com

మహానటి తర్వాత తెలుగులో ఫిమేల్ సెంట్రిక్ కథలనే చేసిన కీర్తి సురేష్ రెండేళ్ళ గ్యాప్ తీసుకొని రంగ్ దే సినిమాలో హీరోతో రొమాన్స్ కి ఒకే చెప్పింది.ఇక నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.

నితిన్ తనకి అలవాటైన రొమాంటిక్ కామెడీతో మరో సారి ఇందులో ఎంటర్టైన్ చేసాడని టీజర్ బట్టి అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

 Rang De Movie Business Expectations 40 Crores, Tollywood, Hero Nithiin, Keerthi-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఓటీటీ చానల్స్ ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయి.సినిమా హైయెస్ట్ గా 36 కోట్ల రూపాయిలు ఇచ్చేందుకు ఒక చానల్ ఆఫర్ చేసింది.

అయితే నిర్మాతలు మాత్రం సినిమా హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యి 40 కోట్ల రూపాయిలు బిజినెస్ ని ఈ సినిమా ద్వారా చేయాలని చూస్తున్నారు.ఈ సినిమాపై ఓ 15 నుంచి 20 కోట్లు మధ్య ఖర్చు చేశారు.
నితిన్ మార్కెట్ ప్రకారం సినిమా మీద అదే బడ్జెట్ పెర్ఫెక్ట్ కూడా.ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆరంభంలో భీష్మ సినిమాతో నితిన్ కెరియర్ లో శాలిడ్ హిట్ వచ్చింది.

దీంతో రంగ్ దే మీద అంచనాలు భారీగా పెరిగాయి.ఈ సినిమా విషయంలో కూడా నితిన్ నుంచి మరోసారి అదే తరహా ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

అందుకు తగ్గట్లే సినిమాని వెంకి సిద్ధం చేశాడు.దీంతో సితార నిర్మాతలు సినిమాకి 40 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు.

శాటిలైట్, డిజిటల్, థియేటర్, హిందీ డబ్బింగ్, ఇలా అన్ని హక్కులు కింది సినిమాని ఇచ్చేయడానికి ఈ రేటు ఫిక్స్ చేశారు.సినిమా థియేటర్ లో రిలీజ్ అయితే నితిన్ ని ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ స్థాయిలో కలెక్షన్ గ్యారెంటీ అని భావించి నిర్మాతలు ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.

మరి సితార వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి ఏ ఒటీటీ సంస్థ ముందుకొస్తుంది అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube