జనవరిలో పెళ్లి చేసుకోనున్న రణ్ బీర్,అలియా!  

Ranbir Singh And Alia Going To Married This January - Telugu Alia Bhat, Anasuya, Ranbir Singh, Ranbir Singh And Alia Marriage, Tollywood Box Office, Tollywood Gossips

గత కొంత కాలంగా బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా పిలవబడుతున్న రణ్ బీర్ కపూర్,అలియా భట్ లు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్న ఈ టాపిక్ కి సంబంధించి ఒక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

Ranbir Singh And Alia Going To Married This January

గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న అలియా,రణ్ బీర్ కపూర్ లో ఈ ఏడాది,వచ్చే ఏడాది అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ వార్తల పై కన్ఫర్మ్ న్యూస్ మాత్రం రాలేదు.అయితే తాజాగా వీరి పెళ్ళికి సంబందించిన వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం తో వీరి పెళ్లి విషయంలో ఒక క్లారిటీ రానుంది.

ఇంతకీ ఆ కార్డ్ లో ఉన్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది అనగా జనవరి 22,2020 న జోధ్ పూర్ లోని ఉమైద్ ప్యాలెస్ భవన్ లో అలియా,రణ్ బీర్ ల వివాహ వేడుక జరగనున్నట్లు ఉంది.అయితే దీనిపై పరోక్షంగా స్పందించిన అలియా ఈ వార్తల్లో నిజం లేదు అంటూ చెప్పడం తో మరోసారి వారి పెళ్లి విషయాన్నీ సస్పెన్స్ లో పెట్టింది.

జనవరిలో పెళ్లి చేసుకోనున్న రణ్ బీర్,అలియా-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఈ లవ్ బర్డ్స్ కలిసి బ్రహ్మాస్త్రా అనే చిత్రం చేస్తున్న విషయం విదితమే.

 వీరి ప్రేమ విషయం బాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఎన్నో సార్లు బహిరంగంగానే వీరి ప్రేమ విషయాన్నీ వెల్లడించిన వీరిద్దరూ ప్రస్తుతం పెళ్లి విషయంలో మాత్రం దాటేస్తూ వస్తున్నారు.అయితే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారా అని అభిమానులతో సహా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ranbir Singh And Alia Going To Married This January-anasuya,ranbir Singh,ranbir Singh And Alia Marriage,tollywood Box Office,tollywood Gossips Related....