దీపికను మోసం చేసింది అందుకే.. బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన రణబీర్?

Ranbir Deepika Bollywood Hero Cheated Bold Statement Film Industry

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి అందరికి తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక స్టార్ హోదాను సంపాదించుకున్నాడు.

 Ranbir Deepika Bollywood Hero Cheated Bold Statement Film Industry-TeluguStop.com

తన నటనకు ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో ఒకడిగా నిలిచాడు.

ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీకి 1997 లో అడుగుపెట్టాడు.

 Ranbir Deepika Bollywood Hero Cheated Bold Statement Film Industry-దీపికను మోసం చేసింది అందుకే.. బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన రణబీర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక 2007లో సవారి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక ఈయన మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తో గతంలో ప్రేమలో పడ్డాడు.ఈ విషయం పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు.

ఇక దీపిక కూడా అతడిని క్షణం వదిలి ఉండలేకపోయేది.

ఎంతో గాఢంగా రణబీర్ ను ప్రేమించింది.కానీ అతని ప్రేమ నిజం కాదని తెలుసుకోలేకపోయింది.

పైగా అతని పేరు టాటూ కూడా వేయించుకుంది.కానీ అతడు మాత్రం మరో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో సన్నిహితంగా ఉండే సరికి జీర్ణించుకోలేక పోయింది.

వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలుసుకొని అతడితో బ్రేక్ అప్ చెప్పుకొని 2018లో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా రణబీర్ దీపికా పదుకొనే గురించి బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.నిజానికి రణబీర్ తన అందంతో ఎంతోమంది అమ్మాయిల హృదయాలను దోచుకున్నాడు.అంతేకాకుండా దీపిక మనసు కూడా అలాగే దోచుకున్నాడు.

కానీ చివరికి తన వల్లనే దీపికను మిస్ చేసుకున్నాడు.దీపిక కూడా చాలాసార్లు రణబీర్ గురించి అసలు నిజాలు చెప్పి బాధపడింది.

ఇక అతడు కూడా తాజాగా ఓపెన్ అయి తాను దీపికను మోసం చేసిన విషయం నిజమేనని ధైర్యంగా ఒప్పుకున్నాడు.ఆమెను నేనే మోసం చేశాను అంటూ.ఆ సమయంలో తన అపరిపక్వత, అనుభవం లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.ఒకరిని టెంప్ట్ చేయడానికి అడ్వాంటేజ్ గా తీసుకున్నాను అంటూ అసలు నిజం చెప్పాడు.

ఈ సంఘటన మొత్తం జరిగిన తర్వాత తాను రియలైజ్ అయ్యానని ఒకరితో కమిటై ఉండనప్పుడు వారితో రిలేషన్ లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని బాధపడ్డాను అని తెలిపాడు.ఇక ఈ మాటలు విన్నాక అందరూ ఇప్పుడు కళ్ళు తెరిచాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.దీపిక పదుకొనె తర్వాత కొంతకాలం వరకు కత్రినా కైఫ్ తో ప్రేమాయణం జరిపాడు.

వీరి మధ్య ఓ రేంజ్ లో బాలీవుడ్ లో టాక్ నడిచింది.ఇక వీరిద్దరి మధ్య కొంతకాలం తర్వాత బ్రేకప్ అవగా ప్రస్తుతం రణబీర్ మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.ఆమెతో కొంతకాలం నుండి సహజీవనం చేస్తున్నట్లు అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

#Ranbir Kapoor #Deepika #Ranbir #RanbirKapoor #Alia Bhatt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube